
హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ సన్‌సిటీకి చెందిన హర్ష్‌కుమార్.. తన కారును 2024 ఆగస్టు 10న రొటీన్ సర్వీస్ కోసం ఓ వర్క్‌షాప్‌నకు అప్పగించారు. అక్కడి నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ ప్రకారం.. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ సన్‌సిటీకి చెందిన హర్ష్‌కుమార్.. తన కారును 2024 ఆగస్టు 10న రొటీన్ సర్వీస్ కోసం ఓ వర్క్‌షాప్‌నకు అప్పగించారు. అక్కడి నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ ప్రకారం.. సర్వీస్ ఛార్జీలు రూ.4 వేలు మాత్రమే అని చెప్పారు. ఎలాంటి విడి భాగాలు మార్చాల్సిన అవసరం లేదని, అదేరోజు సాయంత్రంలోపు కారు తిరిగి ఇచ్చేస్తామని సర్వీస్‌సెంటర్ ప్రతినిధులు హామీనిచ్చి జాప్యం చేశారు. ఆగస్టు 13న కారు తీసుకోవడానికి వెళ్లిన హర్ష్‌కుమార్‌ను రూ.43,231 చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆయన ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించినా.. బిల్లు, జాబ్‌కార్డ్ లేకపోవడంతో సేవాలోపాన్ని నిరూపించలేకపోయారు. ...ఇలా హర్ష్‌కుమార్ ఒక్కరే కాదు.. వాహన సర్వీస్ సెంటర్లలో జరిగే సేవా లోపాలపై అవగాహన లేని అనేకమంది వేల రూపాయలు నష్టపోతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదంటే.. వాహనాన్ని సర్వీస్‌సెంటర్‌లో అప్పగించే సమయం నుంచి డెలివరీ వరకు ప్రతి అంశంలోనూ ఓ ఆధారం ఉండేలా చూసుకోవాలని వినియోగదారుల కమిషన్ తీర్పులు హెచ్చరిస్తున్నాయి. అధీకృత సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించకుండా చౌకగా అయిపోతుందని ఇతర వర్క్‌షాప్‌లకు వెళ్లడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. వెంటనే లీగల్ నోటీసు పంపాలి. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాలనుకుంటే ఆధారాలను సేకరించాలి. జాబ్‌కార్డు, ఎస్టిమేట్, చెల్లింపుల ప్రూఫ్, ఎస్ఎంఎస్, వాట్సప్ చాట్, ఫొటోలు, వీడియోలు, లీగల్ నోటీసు, ప్రతివాది నుంచి వచ్చిన సమాధానాన్ని కమిషన్‌కు సమర్పించాలి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending