
రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా జరిగిందని క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కొత్త క్రీడా విధానం, పెరిగిన రిజర్వేషన్లు రాష్ట్ర విభజన తర్వాత 2017లో తొలిసారిగా క్రీడా విధానాన్ని తీసుకొచ్చామని, అది 2022 వరకు అమల్లో ఉందని అజయ్ జైన్ తెలిపారు. ఆ తర్వాత రెండేళ్లు పాలసీ లేకపోవడంతో, కొత్త ప్రభుత్వం డిసెంబర్ 2024లో జీవో 18 ద్వారా నూతన క్రీడా విధానాన్ని అమల్లోకి తెచ్చిందని వివరించారు. ఈ విధానంలో క్రీడలను ప్రోత్సహించడం, పారా-స్పోర్ట్స్ అథ్లెట్లకు గుర్తింపు, మహిళలు, వెటరన్లకు ప్రాధాన్యత వంటి అంశాలు చేర్చామన్నారు. ముఖ్యంగా, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఉన్న 2 శాతం రిజర్వేషన్‌ను 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్‌గా పెంచినట్లు గుర్తుచేశారు. ఈ రిజర్వేషన్లు కేవలం ఉద్యోగాలకే కాకుండా, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలకు కూడా వర్తిస్తాయని అన్నారు.కేంద్ర ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ 2024 మార్చి 4న జారీ చేసిన మెమోరాండం ఆధారంగా 65 క్రీడాంశాలను గుర్తించి, వాటిని కేటగిరీ 'ఏ', 'బీ'లుగా విభజించినట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ లేనంత...