
ఇంటర్నెట్ డెస్క్: ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్‌పై వేటు పడింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో లెవల్ 1 ఉల్లంఘన చేసినందుకు గాను బీసీసీఐ అతడికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. 2 డీమెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో వేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్ బ్యాగ్‌ను ప్రమాదకరంగా విసిరినట్లు తేలింది. డేవిడ్ తన తప్పును ఒప్పుకొని, మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన శిక్షను అంగీకరించాడు. ఇప్పటికే అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తంగా 5 పాయింట్లకు చేరడంతో 2027లో ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. వచ్చే సంవత్సరం ఆర్సీబీ మొదటి మ్యాచ్‌ను టిమ్ డేవిడ్ ఆడలేడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తన బౌలింగ్‌లో స్విచ్ హిట్‌తో సిక్సర్ కొడితే చాలా కోపమొచ్చేదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఐపీఎల్-19 ఫైనల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ వేసిన ఇన్సింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి విరాట్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శుభ్‌మన్ గిల్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్-19 ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్ వీడియో మీరూ చూడండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics.