
ఇంటర్నెట్డెస్క్: ప్రతి మనిషి జీవితానికి అర్థం ఏంటనేది కనుక్కోవడమే ‘పెద్ది’ మూవీ ఇచ్చే సందేశమని కథానాయిక జాన్వీకపూర్ (Janhvi Kapoor) అన్నారు. రామ్చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో జాన్వీ తెలుగులో మాట్లాడి అలరించారు. ‘‘మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ‘పెద్ది’పైనా ఇలాంటి ప్రేమే చూపిస్తారని ఆశిస్తున్నా. అదే మాకు రోజూ కష్టపడి పనిచేయడానికి బలాన్ని ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. నా జీవితానికి అర్థం అంటే.. మిమ్మల్ని (ప్రేక్షకులు) అలరించడమే. మేము చేసిన ఈ మూవీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని జాన్వీ అన్నారు. ఈ సందర్భంగా జగదేకవీరుడు అతిలోక సుందరిలోని శ్రీదేవి చెప్పిన ‘మానవ.. ఒక్కసారి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకొనవా’ అన్న డైలాగ్లోను వేదికపై చెప్పి నవ్వులు పూయించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక. జూన్ 4న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). రామ్చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్డెస్క్: ప్రతి మనిషి జీవితానికి అర్థం ఏంటనేది కనుక్కోవడమే ‘పెద్ది’ మూవీ ఇచ్చే సందేశమని కథానాయిక జాన్వీకపూర్ (Janhvi Kapoor) అన్నారు. రామ్చరణ్ (Ram Charan)...