
Home » Telangana » Hyderabad » Telangana Cabinet Approves Midday Meals In Junior Colleges And Funds For Godavari Pushkaralu suri ABN , Publish Date - May 23 , 2026 | 06:39 PM ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క... రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలి చర్చించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఈ రోజు భేటీ అయ్యింది. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలి చర్చించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఈ రోజు (శనివారం) భేటీ అయ్యింది. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలి చర్చించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లోనూ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 2027 గోదావరి పుష్కరాల పనులకు రూ.1,000 కోట్లు కేటాయిస్తూ తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తొలివిడతగా రూ.300 కోట్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు నిరుద్యోగ యువతకూ మంత్రిమండలి గుడ్ న్యూస్ చెప్పింది. కరీంనగర్ జిల్లా గంగాధరలోని డిగ్రీ కళాశాలలో నియామకాలకు పచ్చజెండా ఊపింది. 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, 6 నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన మరో 3 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. మహబూబాబాద్ జిల్లా కె.సముద్రం అగ్నిమాపక కేంద్రానికి సంబంధించి 18 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వొద్దా.. బీఆర్ఎస్పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ పెద్దికి పర్సెంటేజ్ కావాల్సిందే.. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం
Summary status: pending