
చీనాబ్- బియాస్ సొరంగం ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనదని హిమాచల్ గవర్నర్ కవిందర్ గుప్తా తాజాగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ చీనాబ్ నదిలోని మిగులు జలాలను బియాస్ పరీవాహక ప్రాంతానికి మళ్లించి, పాకిస్థాన్ కు నీటి సరఫరాను నిలిపివేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జూన్ 1న ప్రారంభమైన జనగణన స్వీయ-గణన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్.. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పడం అత్యవసరమన్నారు.ఇది గత లోపాలను సరిదిద్దే చర్య అని.. పంజాబ్, హిమాచల్, హర్యానా, ఉత్తరా ఖండ్ రాష్ట్రాల అవసరాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. జనగణన గణాంకాలు పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాల రూపకల్పనలో ప్రభుత్వానికి తోడ్పడతాయని గవర్నర్ తెలిపారు. హిమాచల్‌ లో పౌరులు జూన్ 1 నుండి జూన్ 15 వరకు ఆన్‌ లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చు. ఈ పదిహేను రోజుల్లో కుటుంబ సభ్యులందరి వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేయాలి. ఖచ్చితమైన సమాచారం అందించి, ఈ జనగణన డ్రైవ్‌ లో సహకరించాలని గవర్నర్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఇక భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకునే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్, పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది.వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. అలాగే పాకిస్థాన్ పై కఠిన ఆంక్షలు విధించింది. ఆంక్షల్లో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేత, సింధూ జలాల పంపిణీ నిలిపివేత చేశారు.  ఇక భారత్, పాకిస్థాన్ మధ్య 1960, సెప్టెంబరు 19న జరిగిన ఒప్పందం ప్రకారం ఈ నదీ వ్యవస్థ మొత్తం నీటిలో 20 శాతం భారత్, 80 శాతం పాకిస్థాన్‌ వినియోగించుకోవాలి.  చీనాబ్- బియాస్ సొరంగం ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనదని హిమాచల్ గవర్నర్ కవిందర్ గుప్తా తాజాగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ చీనాబ్ నదిలోని మిగులు జలాలను బియాస్ పరీవాహక ప్రాంతానికి మళ్లించి,...