
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమవారం విజయవాడలో అశేష జనవాహిని మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగంతో అభిమానులను ఉత్తేజపరిచారు.విజయవాడలో ఈ వేడుక ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లా కాకుండా, సక్సెస్ మీట్‌లా ఉందని చరణ్ వ్యాఖ్యానించారు. అభిమానుల ఉత్సాహం, ప్రేమ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. "విజయవాడ మాకు అదృష్ట నగరం. నాన్నగారి పలు చిత్రాల బ్లాక్బస్టర్ల వేడుకలు ఇక్కడే జరిగాయి. ఆ సెంటిమెంట్‌ను, లక్‌ను మాతో తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం" అని చరణ్ పేర్కొన్నారు. ఇంత వేడిలోనూ గంటల తరబడి ఎదురుచూసిన అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.'పెద్ది' కథ గురించి మాట్లాడుతూ, "ఒక నటుడిగా ఎన్నో కథలు వింటాం. కొన్ని నచ్చుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు నా గుండెకు హత్తుకుపోయింది. ఇది పదేళ్లకొకసారి వచ్చే అద్భుతమైన కథ. ఈ కథ నా సినీ ప్రయాణంలో దొరికినందుకు దర్శకుడు బుచ్చిబాబు గురువుగారైన సుకుమార్ గారికి కృతజ్ఞతలు. నా సినిమా లైబ్రరీలో ఇది చిరకాలం నిలిచిపోయే చిత్రమవుతుంది" అని అన్నారు. ఇది ఎగిసిపడే మనిషి కథ కాదని, కింద పడిపోయిన వాడు తిరిగి ఎలా లేచి నిలబడ్డాడో చెప్పే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ...