క్రికెట్ ప్రేమికులను గత రెండు నెలలుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన ఐపీఎల్ (IPL 2026) హంగామా ముగిసింది. అయితే, ఈ ఐపీఎల్ ఫీవర్ కారణంగా ఈ ఏడాది సమ్మర్లో పెద్ద సినిమాలేవీ థియేటర్ల వైపు వచ్చే ధైర్యం చేయలేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కోత పడుతుందేమోనని స్టార్ హీరోలంతా తమ చిత్రాలను వాయిదా వేసుకున్నారు. దాంతో టాలీవుడ్ థియేటర్లన్నీ గత కొన్ని వారాలుగా సరైన ఊపు లేక కాస్త బోసిపోయి కనిపించాయనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఐపీఎల్ ముగియడంతో అందరి దృష్టి సినిమా ఇండస్ట్రీ వైపు మళ్లింది. ఈ సమ్మర్ ఎండింగ్లో బాక్సాఫీస్ దాహాన్ని తీర్చడానికి, టాలీవుడ్‌కి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ‘పెద్ది’ సినిమా (Peddi Movie) థియేటర్లలోకి దిగుతోంది.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపైనే ఎన్నో హోప్స్ పెట్టుకున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులను భారీగా రప్పించి, సాలిడ్ సమ్మర్ హిట్ కొట్టే బాధ్యత ఇప్పుడు ‘పెద్ది’ భుజాల మీద పడింది. క్రికెట్ వినోదానికి తెరపడటంతో.. ఇక ‘పెద్ది’ అసలు సిసలైన ఆట వెండితెరపై మొదలు కాబోతోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, థియేటర్లలో ఏ రేంజ్ రచ్చ చేస్తుందో తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. గెట్ రెడీ ఫర్ ది ‘పెద్ది’ గేమ్!

మెగాభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan)కు కూడా మంచి సాలిడ్ హిట్ కావాలి. ఎలా చూసినా.. ‘పెద్ది’పై చాలానే బాధ్యత ఉందనేది స్పష్టమవుతోంది. మరి ఈ బాధ్యతని ‘పెద్ది’ ఎలా మోస్తాడనేది చూడాలి. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం.. సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలన్నింటి దాటుకుని.. ‘పెద్ది’ ఎలాంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుందో? దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) ఈసారి ఏం ప్లాన్ చేశాడో? అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి:

కెరీర్లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!

Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!

క్రికెట్ ప్రేమికులను గత రెండు నెలలుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన ఐపీఎల్ (IPL 2026) హంగామా ముగిసింది. అయితే, ఈ ఐపీఎల్ ఫీవర్ కారణంగా ఈ ఏడాది సమ్మర్లో పెద్ద సినిమాలేవీ...