
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: నంద్యాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం ఘటన పూర్తిగా ముందస్తు ప్రణాళితో జరిగిన కుట్ర అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ఒక పద్ధతి ప్రకారం నాటకాలు ఆడి ఆ నెపాన్ని ప్రభుత్వంపై, తమ పార్టీపై నెట్టేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ ఘటనకు తనకు, తెదేపా నాయకులకు, కార్యకర్తలకు ఏ సంబంధమూ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి నాటకాలు ఆడటం జగన్కు మొదటి నుంచి అలవాటేనని, వాటిని ప్రజలు నమ్మరని అన్నారు. 2002-03లో రాజశేఖరరెడ్డికి హైదరాబాద్లో ఉన్న ఆస్తి తప్ప ఏమీ లేదని, ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని అన్నారు. అప్పట్లో ఒక ఫైల్ తన వద్దకు వచ్చినప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉన్నా మానవతా దృక్పథంతో క్యాబినెట్లో ఆమోదించి వారికి సహాయం చేశామని గుర్తు చేశారు. తాము ఎల్లప్పుడూ నంద్యాల ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడడానికే కృషి చేస్తున్నామన్నారు. కొందరు బయటి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తూ ప్రశాంతతను భంగపరిచే పద్ధతి మంచిది కాదని హితవు పలికారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. నంద్యాల పట్టణం, న్యూస్టుడే: నంద్యాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం ఘటన పూర్తిగా ముందస్తు ప్రణాళితో జరిగిన కుట్ర అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ...