
వీరభద్ర గ్రానైట్ క్వారీలో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందం చీమకుర్తి, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం పంచాయతీ పరిధిలోని వీరభద్ర మినరల్స్, శాంభవి గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందాలు సోమవారం తనిఖీలు చేపట్టాయి. విజిలెన్స్ అదనపు ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయా క్వారీల్లో ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. చీమకుర్తి పరిధిలోని సర్వే నంబరు 581లో గల వీరభద్ర మినరల్స్ క్వారీలోనూ సోదాలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మామ అయిన జి.ప్రతాప్‌రెడ్డికి చెందిన ఈ క్వారీలో మైనింగ్ ప్లాన్ ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాలను పరిశీలించారు. ఎంతమేరకు తవ్వకాలు జరిపారో గుంతల కొలతలు, నిల్వ చేసి ఉన్న గ్రానైట్ బ్లాకుల కొలతలు సేకరించారు. వ్యర్థాలు పోసే డంప్ యార్డు, పలు రికార్డులను పరిశీలించారు. ఆర్‌ఎల్‌పురం పంచాయతీ పరిధిలోని శాంభవి గ్రానైట్ క్వారీకి చెందిన డంప్‌యార్డును మరో బృందం పరిశీలించింది. మంగళవారం ఈ క్వారీలో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. వీరభద్ర గ్రానైట్ క్వారీలో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందం చీమకుర్తి, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం పంచాయతీ పరిధిలోని వీరభద్ర...