
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం వల్ల అప్పుడప్పుడు కొన్ని అరుదైన, శక్తివంతమైన శుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే జూన్ 2 నుండి 4వ తేదీ వరకు గ్రహాల స్థితిగతులలో వచ్చే మార్పుల వల్ల అత్యంత పవిత్రమైన చంద్రాధియోగం (Chandra Adhi Yoga) ఏర్పడబోతోంది. చంద్రుడు ధనూ రాశిలో సంచరిస్తున్న సమయంలో.. బుధ, శుక్ర, గురు గ్రహాల అనుకూల స్థానాల వల్ల ఈ అధికార యోగం రూపుదిద్దుకుంది. చంద్రాధియోగంతో 6 రాశులవారికి ఊహించని అదృష్టంచంద్రాధియోగంతో ముఖ్యంగా 6 రాశుల వారికి ఊహించని అదృష్టం, సమాజంలో ఉన్నత పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు రోజుల వ్యవధిలో చేపట్టే ఎలాంటి కొత్త పనులైనా విజయవంతం అవుతాయి. ఉద్యోగ మార్పులు, పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఆ విశేష ప్రయోజనాలు పొందే ఆ 6 రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం:మేష రాశి: ఈ రాశి వారికి భాగ్య స్థానంలో యోగం పట్టడం వల్ల విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. కార్యాలయాల్లో ప్రమోషన్లు లభిస్తాయి. తండ్రి వైపు నుండి ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.మిథున రాశి: సమాజంలో మరియు బంధువులలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.కన్య రాశి: ఉద్యోగస్తులకు డిమాండ్ పెరిగి ఉన్నత పదవులు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో ఉన్నవారికి సంపన్న కుటుంబం నుండి సంబంధం కుదురుతుంది.వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ధన లాభం చేకూరుతుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ పెట్టుబడులు కలిసి వస్తాయి.12 ఏళ్ల తర్వాత అద్భుతం: కర్కాటక రాశిలోకి ఉచ్ఛ గురువు.. వీరికే రాజయోగం!ధనుస్సు రాశి: చంద్రుడి సంచారం ఈ రాశిలోనే జరగడం వల్ల కెరీర్‌లో ఊహించని పురోగతి ఉంటుంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది.కుంభ రాశి: సామాజికంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన సంపద చేతికి అందుతుంది. సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది.గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం వల్ల అప్పుడప్పుడు కొన్ని అరుదైన, శక్తివంతమైన శుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే జూన్ 2 నుండి 4వ తేదీ వరకు గ్రహాల స్థితిగతులలో వచ్చే...