
తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అప్ డేట్. రాష్ట్ర ప్రభుత్వం వాహన చలాన్ల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ల సమాచారం ప్రతి వాహన యజమానికి సమయానికి చేరే విధంగా రవాణా శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వాహనదారులు ఆన్‌ లైన్‌ లో తమ వివరాలను అప్‌ డేట్ చేసుకోవాలని సూచనలు చేసింది.చలాన్లను పంపేందుకు మొబైల్ నంబర్, వాట్సాప్, ఈ-మెయిల్ వివరాలను నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వ అధికారిక http://vahan.parivahan.gov.in వెబ్‌ సైట్‌ లో అప్‌ డేట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిశాక Vahan పోర్టల్‌ లో నమోదై ఉన్న నంబరు/ఈ-మెయిల్‌ కు SMS లేదా WhatsApp లేదా Mail ద్వారా పంపిన చలాన్.. సంబంధిత వాహన యజమానికి అందినట్లుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. ట్రాఫిక్ చలాన్ల విషయంలో మరింత కఠిన వైఖరి అనుసరించడంలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.దాంతోపాటు చలాన్ల విషయంలో పారదర్శకత పెరగడం, పెండింగ్ బకాయిల వసూళ్లు కూడా వేగవంతం అవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై మాకు చలాన్ సమాచారం రాలేదు.. మెసేజ్ రాలేదు.. తదితర కారణాలను అధికారులు అంగీకరించరని తెలిపారు.  తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అప్ డేట్. రాష్ట్ర ప్రభుత్వం వాహన చలాన్ల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ల సమాచారం ప్రతి వాహన యజమానికి సమయానికి చేరే విధంగా రవాణా శాఖ...