ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. దాదాపు 15వేలమంది ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచాలని తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇప్పటికే కేబినెట్లో ఆమోదం తెలియజేయగా.. ఆర్థికశాఖకు పంపారు.. అనంతరం ఆ ఫైల్ సీఎంవోకు చేరింది.. తాజాగా సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. అనంతరం ఈ ఫైల్ మళ్లీ త్వరలో జరగబోయే కేబినెట్ ముందుకు వెళుతుంది.. అక్కడ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను పథకం) అమల్లోకి రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎంపికైన ఉద్యోగులు కొందరు కొన్ని అనివార్య కారణాలతో సీపీఎస్ అమల్లోకి వచ్చాక ఉద్యోగాల్లో చేరారు.. వారందరికి పాత పింఛన్ అమలు చేసే ప్రతిపాదనలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, పాత పింఛన్ అమలుకు సంబంధించి ఇటీవల ఆర్థిక శాఖ నుంచి రెండు ఫైల్స్ సీఎంవోకు వెళ్లాయి. తాజాగా చంద్రబాబు ఆమోదం తెలియజేయడంతో పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నిర్ణయంతో దాదాపుగా 15వేలమంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే పాత పింఛన్ అమలు చేస్తే 11వేలమందికి ఉద్యోగులకు ప్రయోజనం దక్కనుంది. చాలా ఏళ్లుగా ఈ రెండు అంశాలపై ఉద్యోగులు పోరాటం చేస్తుండగా.. చివరికి సమస్యలు పరిష్కారం అయ్యాయి.. ఉద్యోగులకు ఊరట దక్కింది. త్వరలోనే కేబినెట్లో ఆమోదించి అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నారు.గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచారు. కాకపోతే ఈ పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాలు, ప్రభుత్వరంగ సంస్థలకు వర్తింప చేయలేదు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచింది. అలాగే సీసీఎస్ అమల్లోకి రాకమందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా కొందరు ఉద్యోగాలు సంపాదించారు. కానీ వారంతా సీపీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరారు. దీంతో వారంతా పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని చాలా ఏళ్లుగా కోరుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం పాత పింఛను అమలుకు సిద్ధమైంది. ఈ రెండు నిర్ణయాలను ఏపీ ఉద్యోగ సంఘాల నేత విద్యాసాగర్ స్వాగతించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాలపై ఆనందంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. దాదాపు 15వేలమంది ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు...