వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇది ఫంగస్‌ను మూలాల నుంచి నాశనం చేస్తుంది. అయితే దీనిని ఎలా ఉపయోగించాలంటే 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలను బాగా నూరి రసం తీయాలి. ఈ రసానికి ఒక స్పూన్ నేచురల్ కొబ్బరి నూనె కలపాలి. ఎందుకంటే కొబ్బరి నూనె వేయడం వల్ల చర్మానికి మంట పుట్టకుండా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని శోభి మచ్చలపై రాసి సుమారు 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆయుర్వేదంలో వేపను చర్మ వ్యాధులకు బెస్ట్ మెడిసిన్గ చెబుతారు. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు ఫంగస్ వ్యాప్తిని అరికడుతాయి. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. ఒక గుప్పెడు తాజా వేప ఆకులను తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి లేదా నూరాలి. దీనికి ఒక పావు స్పూన్ పసుపు కలిపి మచ్చలపై రాయాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి. లేదా రాత్రి పడుకునే ముందు శోభి మచ్చలు ఉన్న చోట వేప నూనెను అప్లయ్ చేసి ఉదయం నిద్రలేవగానే కడిగేసుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్లో ఉండే టెర్పినెన్ - 4 ఓల్ అనే సమ్మేళనం ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అయితే డైరెక్ట్‌గా టీ ట్రీ ఆయిల్‌ను చర్మంపై రాయకూడదు. ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో 4 లేదా 5 చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో శోభి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇది చర్మం యొక్క పీహెచ్ లెవల్స్‌ని మార్చడం ద్వారా ఫంగస్ పెరగడాన్ని అడ్డుకుంటుంది. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. 1:1 రేషియాలో అంటే సమపాళ్లలో యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని కలపాలి. ఆ నీటిని శోభి మచ్చలపై రాసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేయాలి. కలబంద చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇక పసుపులో ఉండే కర్కుమిన్ ఫంగస్‌తో పోరారుడుతంది. అలాగే మచ్చల వచ్చే దురదు తగ్గిస్తుంది. దీనిని ఎలా ఉపయోగించాలంటే తాజా కలబంద జెల్‌కు అర స్పూన్ పసుపు కలిపి పేస్ట్‌లా రాయాలి. దీనిని మచ్చలపై రాసి పొడిగా అయ్యే వరకు ఉంచి ఆపై కడిగేసుకోవాలి. చక్కెర పదార్థాలు, మైదా, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ తగ్గించాలి. ఎందుకంటే షుగర్ ఫంగస్‌కు ఆహారం లాంటిది. ఇక రోజువారీ ఆహారంలో పెరుగు లేదా మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ఇది పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అల్లం, పసుపు, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొందర నిపుణులు, కొన్ని అధ్యయనాలు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు. రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇది ఫంగస్‌ను మూలాల నుంచి నాశనం చేస్తుంది. అయితే దీనిని ఎలా ఉపయోగించాలంటే 3 లేదా 4...