'ఓజీ' హీరోయిన్ ప్రియాంక మోహన్ కు అరుదైన గౌరవం దక్కింది. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ఆమె నియమించబడింది. ఈ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొరియా సంస్కృతిని భారతీయులకు మరింత చేరువ చేయగల వ్యక్తిగా నన్ను గుర్తించినందుకు అక్కడి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా కొరియా ప్రతినిధులతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది.''ఈ అద్భుతమైన గౌరవానికి అపరిమితమైన కృతజ్ఞతలు. కొరియా పర్యాటకానికి గౌరవ రాయబారిగా నియమితులవడం నాకు నిజంగా చాలా ప్రత్యేకమైనది. కొరియా సంస్కృతిని భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేయగల వ్యక్తిగా నన్ను గుర్తించినందుకు కొరియా ప్రభుత్వానికి, కొరియా పర్యాటక సంస్థకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కొరియా సంస్కృతి, సంప్రదాయాలు, ఆప్యాయత నన్ను ఎల్లప్పుడూ ఇన్స్పైర్ చేస్తాయి. ఈ బ్యూటిఫుల్ జర్నీలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాపై ఉంచిన నమ్మకానికి, ఆత్మీయ స్వాగతానికి కొరియా పర్యాటక సంస్థ అధ్యక్షులకు ధన్యవాదాలు. రాబోయే వాటి కోసం ఎదురుచూస్తున్నాను'' అని ప్రియాంక మోహన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) 'కింగ్ 100' ఫేమ్ రా. కార్తీక్ దర్శకత్వంలో ప్రియాంక ప్రధాన పాత్రలో ‘మేడ్ ఇన్ కొరియా’ అనే చిత్రం తెరకెక్కింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం రూపొందించిన ఈ సినిమా.. మార్చి నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ చేయబడింది. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని నాగార్జునతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ సినిమానే ప్రియాంకకు అరుదైన గౌరవం దక్కడానికి కారణమైంది. ఆ మధ్య ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFD 2026)లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు హాజరైన విందుకు ప్రియాంక మోహన్‌కు ఆహ్వానం లభించింది. ఈ క్రమంలో కొరియా ప్రభుత్వం ఆమెను కొరియా పర్యాటకానికి గౌరవ రాయబారిగా నియమించింది. ఇక సినిమాల విషయానికి వస్తే, 2019లో నాని 'గ్యాంగ్ లీడర్' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక మోహన్. 'శ్రీకరం', 'వరుణ్ డాక్టర్', 'ఈటీ', 'డాన్', 'సరిపోదా శనివారం' వంటి తెలుగు, తమిళ చిత్రాలతో అలరించింది. పవన్ కళ్యాణ్ తో కలిసి ఆమె నటించిన 'ఓజీ' సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తాజాగా ఆమె తన డ్రీమ్ ప్రాజెక్టును ప్రకటించింది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో 'మంజనథి' సినిమా చేయనుంది. మారి దర్శకత్వం, ఇళయరాజా సంగీతం.. ఇలా ఇద్దరు గొప్ప టెక్నీషియన్స్ ఉన్న సినిమాలో భాగం కావడం తన అదృష్టంగా పేర్కొంది. దీంతో పాటుగా తమిళ, కన్నడ భాషల్లో రెండు సినిమాలు చేస్తోంది. అలానే వెట్రిమారన్ డైరెక్షన్ లో శింబు హీరోగా నటిస్తున్న 'అసరన్' మూవీలో ప్రియాంకని లీడ్ హీరోయిన్ గా తీసుకున్నట్లు టాక్. 'ఓజీ' హీరోయిన్ ప్రియాంక మోహన్ కు అరుదైన గౌరవం దక్కింది. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ఆమె నియమించబడింది. ఈ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొరియా సంస్కృతిని...