మేష రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు ఆధ్మాతిక విషయాలపై ఆసక్తి పెంచుకోవచ్చు. మీ ప్రయాణాలకు సంబంధించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. గురు గ్రహ సంచారం కారణంగా అత్యంత శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పిల్లల జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు ఊహించని లాభాలు కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈరోజు గురు గ్రహం ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అయితే మీ ఖర్చులు ఎక్కువగా పెరగొచ్చు. మీ ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయి. ఈరోజు వివిధ శుభకార్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ తోబుట్టువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఇంట్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలు రావొచ్చు. గురు గ్రహం ప్రభావంతో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయాణాలన్నింట్లో మంచి ఫలితాలు రావొచ్చు. మీకు దూర ప్రయాణం చేసే అవకాశం లభించొచ్చు. ఈరోజు మీరు శుభకార్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు గురు గ్రహం ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఇదే రాశిలో హంస రాజయోగం ఏర్పడటంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే ప్రయాణాలన్నింట్లో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ చుట్టూ కొంత గందరగోళం ఉండొచ్చు. మీరు చేసే పనుల్లో కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుందిద. గురు గ్రహం ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల మీ ఖర్చులు పెరగొచ్చు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే శుభకార్యాలన్నింట్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. ఏదైనా ఒక నిర్దిష్ట విషయం గురించి అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కన్య రాశి వారికి ఈరోజు గురు గ్రహం తన స్థానాన్ని మారడం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి లాభాలు రావొచ్చు. మీకు వాహనాలు, ఇతర వస్తువులపై ఎక్కువ డబ్బు ఖర్చు కావొచ్చు. మీకు చాలా రంగాల్లో అదృష్టం కలిసి రావొచ్చు. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో సులభమైన విజయాలు సాధించొచ్చు. మీ ప్రియమైన వారిని కలుసుకోవచ్చు. ఉద్యోగం మారాలని యోచిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. తులా రాశి వారికి ఈరోజు శుక్ర, గురు గ్రహాల ప్రభావంతో అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన లాభాలు రావొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం, సామరస్యం మరింత బలపడతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మరోవైపు శుక్రుడి ప్రభావంతో ఆర్థిక పరమైన ఖర్చులు పెరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో మంచి ప్రయోజనాలు లభించొచ్చు. చంద్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం కారణంగా అత్యంత శుభప్రదమైన, లాభదాయకమైన రోజుగా మారొచ్చు. మరోవైపు గురుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం కారణంగా కెరీర్ పరంగా మీకు పురోగతి లభించొచ్చు. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ఆరో స్థానంలో సంచారం చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చు. ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. చంద్ర గ్రహ సంచారం వల్ల మీకు అత్యంత శుభప్రదమైన ఫలితాలు రావొచ్చు. ఈ రాశి నుంచి గురుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం కారణంగా కొంత గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సంయమనం పాటించాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీ తల్లిదండ్రుల నుంచి ఆశీస్సులు లభించొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీరు కొంత మానసిక ఒత్తిడిని అనుభవించొచ్చు. మకర రాశి వారికి ఈరోజు గురు గ్రహం ప్రభావంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో సులభంగా విజయాలు సాధించొచ్చు. శుభ యోగాల కారణంగా మీ పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో