
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Peddi Movie Pre Release Event: రామ్ చరణ్‌తో కలిసి పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో కలిసేందుకు వస్తున్న నటి జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉందని.. ఈ ప్రేమే తాము రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలాన్ని ఇస్తుందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని తన తల్లి శ్రీదేవి చెప్పిన మాటలను జాన్వీ కపూర్ పునరుద్ఘాటించారు. Also Read: Ram Charan: అభిమానుల కోసం రక్తం చిందించి పనిచేస్తా.. రామ్ చరణ్ భావోద్వేగం విజయవాడలో సోమవారం జరిగిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సినీ నటుడు రామ్ చరణ్‌తో కలిసి పాల్గొన్న జాన్వీ కపూర్ కొన్ని విషయాలపై మాట్లాడారు. 'పెద్ది సినిమాలో ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే.. మీ ఐడెంటిటీని, మీ జీవితానికి ఉన్న అర్థాన్ని కనుక్కోవడం. తన ఐడెంటిటీ ఈ భూమితో, ఇక్కడి ప్రేక్షకులతో ఎంతో లోతుగా కనెక్ట్ అయి ఉంది' అని తెలిపారు. 'సినిమా విడుదల కాకముందే నాకు చాలా విషయాలను ఇచ్చింది. రామ్ చరణ్‌తో కలిసి పనిచేసే అద్భుతమైన అవకాశం లభించింది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అద్భుతమైన నటుడు' అని రామ్ చరణ్‌పై జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు. 'దర్శకుడు బుచ్చిబాబు నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ డైరెక్టర్. డీఓపీ రాండీ, సంగీత లెజెండ్ ఏఆర్ రెహమాన్, ప్రొడ్యూసర్ సతీష్, ప్రవీణ్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం' అని జాన్వీ కపూర్ తెలిపారు. 'తెలుగు ప్రేక్షకులు, సినిమా గురించి అమ్మ (శ్రీదేవి) ఎప్పుడూ ఒక మాట చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని అమ్మ ఎప్పుడూ చెప్పేవారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమే నాకు సర్వస్వం' అని జాన్వీ పేర్కొన్నారు. Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రసంగం అనంతరం యాంకర్ సుమ హీరోయిన్ జాన్వీని కొన్ని ప్రశ్నలు అడిగారు. దర్శకుడు బుచ్చిబాబును 'రౌడీ డైరెక్టర్' అని ఎందుకు అన్నారని ప్రశ్నించగా.. 'ఆయన (బుచ్చిబాబు) ప్రతి టేక్ అయిపోయాక అదిరిపోయింది అమ్మా.. అదిరిపోయింది. కానీ మళ్లీ ఒకసారి టేక్' అని జాన్వీ కపూర్ వివరించారు. ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చి వెంటనే ఇంకో టేక్ అడిగేవారని సరదాగా ఆయనను ఇమిటేట్ చేసి జాన్వీ చూపించారు. చిరంజీవి, శ్రీదేవి నటించిన ఐకానిక్ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లోని డైలాగ్‌ను జాన్వీ కపూర్ చెప్పారు. 'ఓ మానవా.. ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా' అని చెప్పడంతో ప్రేక్షకులు కేకలు వేశారు. ఈ వేడుకకు హాజరైన నటుడు జగపతి బాబు ప్రసంగిస్తూ.. '1962లో విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న సరోజిని దేవి హాస్పిటల్లోనే నేను పుట్టా. గవర్నర్‌పేటలో ముంతకింద పప్పు తింటూ, సెలవులన్నీ ఇక్కడే గడిపా' అని గుర్తుచేసుకున్నారు. పెద్ది సినిమా పరిశ్రమకు.. డిస్ట్రిబ్యూటర్స్‌కు, ఎగ్జిబిటర్స్‌కు ఒక పెద్ద దిక్కు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరవింద సమేత తర్వాత దాదాపు ఎనిమిదేళ్లకు తనకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ దొరికిందని.. ఇందులో తాను 'అప్పలసూరి' పాత్ర చేస్తున్నా. ఇది నా కెరీర్లోనే ఉత్తమ పాత్ర అవుతుంది' అని తెలిపారు. 'రామ్ చరణ్ ఈ సినిమాలో తన మెగా పవర్ ఏమిటో చూపిస్తాడు. సినిమాలో ప్రతి షాట్ సిక్సర్లా ఉంటుంది. Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు...