
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Peddi Movie Release Event: 'ఒక నటుడిగా ఎన్నో కథలు వింటూ ఉంటాం.. కొన్ని నచ్చుతాయి.. కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు మాత్రం అది గుండెకు హత్తుకుంది' అని సినీ నటుడు రామ్ చరణ్ తెలిపారు. 'మా నాన్న (చిరంజీవి) చెప్పినట్టు ఇలాంటి కథ పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అలాంటి కథ నా వద్దకు వచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు గురువు సుకుమార్, బుచ్చిబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది నా జీవితకాల సినిమా లైబ్రరీలో టాప్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచిపోతుంది' అని రామ్ చరణ్ తెలిపారు. Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుండగా.. ప్రీ రిలీజ్ వేడుక విజయవాడలో జరిగింది. ఈ సభలో అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ కీలక ప్రసంగం చేశారు. 'విజయవాడలో వాతావరణం చూస్తుంటే ఇది ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లా లేదు.. అప్పుడే సక్సెస్ మీట్ చేస్తున్నట్లుగా ఉంది. విజయవాడ అనేది మా కుటుంబానికి ఎంతో లక్కీ సిటీ. గతంలో 'ఇంద్ర', 'ఖైదీ నెంబర్ 150' వేడుకలు కూడా ఇక్కడే జరిగాయి. ఆ లక్ కోసమే మళ్లీ ఇక్కడికి వచ్చాం' అని రామ్ చరణ్ గుర్తుచేశారు. 'ఇది ఒక సినిమా స్టోరీ కాదు, కింద పడిపోయిన ఒక మనిషి మళ్లీ లేచి ఎలా నిలబడ్డాడనే ఒక వ్యక్తి అద్భుతమైన ప్రయాణం. గతంలో నాకు'మగధీర', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు చేస్తున్నప్పుడు ఎలాంటి అద్భుతమైన ఫీలింగ్, అనుభవం కలిగిందో.. మళ్లీ అంతటి భావం ఈ పెద్ది సినిమా చేస్తున్నప్పుడు కలిగింది' అని రామ్ చరణ్ తెలిపారు. బుచ్చిబాబు ఈ కథను రాసుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయానని.. భవిష్యత్‌లో ఇండియాలోనే టాప్ 3 లేదా 4 డైరెక్టర్ల జాబితాలో బుచ్చిబాబు పేరు కచ్చితంగా ఉంటుందని జోష్యం చెప్పారు. Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు తాను అభిమానుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని రామ్ చరణ్ ప్రకటించారు. తాను ఇటువంటి సినిమాలు ఒప్పుకోవడానికి కారణం అభిమానులే.. వారి ఇచ్చే ఉత్సాహం.. ప్రోత్సాహంతోనే సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు. అభిమానుల కోసం చేతులు ఇరగ్గొట్టుకోవడమే కాదు రక్తం చిందించి అయినా పని చేస్తానని భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి కొడుకుగా పుట్టి, పవన్ కల్యాణ్ నీడలో పెరిగిన తనకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదని తెలిపారు. తాను చనిపోయే వరకు ప్రేక్షకులను అలరిస్తూ.. వారికి వినోదం అందిస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. 'ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన రత్నవేలుతో నాకు నాలుగో సినిమా. జాన్వీ కపూర్ శ్రీదేవి కంటే గొప్ప నటి కావాలి' అని రామ్ చరణ్ ఆకాంక్షించారు. జూన్ 4వ తేదీన అందరూ థియేటర్లో తప్పకుండా చూడాలని రామ్ చరణ్ కోరారు. సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు...