
Peddi Event : రామ్ చరణ్ పెద్ది సినిమా పాన్ ఇండియా వైడ్ జూన్ 4న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులు పెద్ది కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా దేశమంతటా భారీ ఎత్తున చేస్తున్నారు. ఇప్పటికే నార్త్, సౌత్ లో అనేక నగరాల్లో పెద్ది ఈవెంట్స్ నిర్వహించారు. నిన్న జూన్ 1న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే హైదరాబాద్ లో కూడా ఓ ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేసారు మూవీ యూనిట్. హైదరాబాద్ లో నేడే జూన్ 2న రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఈ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. Also Read : Ram Charan : ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్.. ఫొటోలు.. ఈ హైదరాబాద్ పెద్ది ఈవెంట్ కి కూడా రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఏఆర్ రహమాన్, బుచ్చిబాబు సాన, నిర్మాత వెంకట సతీష్, పలువురు మూవీ యూనిట్ హాజరు కానున్నారు. ఇక రేపు జూన్ 3 రాత్రి నుంచే ఓవర్సీస్ లో, ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. Telugu » Movies » Ram Charan Peddi Event In Hyderabad Details Here 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Peddi Event : రామ్ చరణ్ పెద్ది సినిమా పాన్ ఇండియా వైడ్ జూన్ 4న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులు పెద్ది కోసం ఆతృతగా...