
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: భాగ్యనగర మెట్రో సేవలు న్యూయార్క్ మెట్రో కంటే బాగున్నాయంటూ బ్రిటన్కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ ప్రశంసించారు. ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో నాలుగు రోజులుగా వైరల్ అవుతోంది. ఇండియా పర్యటనలో భాగంగా గత వారం హైదరాబాద్ వచ్చిన ఇషాక్ మెట్రోలో ప్రయాణించారు. అనంతరం ఇన్స్టాగ్రామ్లో ‘పబ్లిక్ మెట్రో ఇన్ హైదరాబాద్’ పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో మెట్రోస్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలను చూపించారు. ‘‘ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను ఇప్పటివరకు ప్రయాణించిన మెట్రో వ్యవస్థల్లో నాకు అత్యంత ఇష్టమైన వాటిల్లో ఒకటి. నిర్వహణ ఎంతో ఆకట్టుకుంది’’ అని వ్యాఖ్యానించారు. మెట్రో రైలు లోపల ఏర్పాటు చేసిన ప్రకటనలు ఆకర్షణీయంగా ఉన్నాయని, కోచ్ల పరిశుభ్రత తనను ఎక్కువగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఈనాడు డిజిటల్, హైదరాబాద్: భాగ్యనగర మెట్రో సేవలు న్యూయార్క్ మెట్రో కంటే బాగున్నాయంటూ బ్రిటన్కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ ప్రశంసించారు. ఆయన చేసిన...