
Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న భారీగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. చరణ్ కి నార్త్ లో కూడా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే. అందుకే నార్త్ లో కూడా పెద్ది సినిమా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. జియో స్టూడియోస్ ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తుంది. నార్త్ ని కూడా టార్గెట్ చేసి ముంబై, భోపాల్, ఢిల్లీలో పెద్ది సినిమా ఈవెంట్స్ నిర్వహించారు. అయితే టాలీవుడ్ లో, సౌత్ లో పెద్ది సినిమాకు ఎలాంటి పోటీ లేకపోయినా నార్త్ లో మాత్రం పెద్ది సినిమాకు పెద్ద పోటీనే ఉంది. Also Read : Peddi Collections : ఇలా అయితే కష్టమే.. పెద్ది కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్.. నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. వరుణ్ ధావన్ హీరోగా మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 5న హిందీలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కూడా నార్త్ అంతా భారీగానే రిలీజ్ చేస్తున్నారు. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే ముగ్గురూ స్టార్స్. ఎంత కాదనుకున్నా ఈ సినిమా నుంచి పెద్దికి నార్త్ లో మాత్రం గట్టి పోటీ ఎదురవుతుంది. అయితే పెద్ది జూన్ 4 రిలీజ్ అయితే ఇది జూన్ 5 కాబట్టి మొదటి రోజు మాత్రం నార్త్ లో పెద్దికి భారీగా ఓపెనింగ్స్ వస్తాయని తెలుస్తుంది. మరి ఈ పోటీ తట్టుకొని పెద్ది నార్త్ లో నిలబడుతుందా లేదా చూడాలి. Telugu » Movies » Ram Charan Peddi Compete With Mrunal Thakur Pooja Hegde Movie In North 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న భారీగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. చరణ్ కి నార్త్ లో...