
Telangana Formation Day Celebrations : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లాల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. Also Read : Divvala Madhuri : తెలంగాణ రాజకీయాల్లోకి దివ్వల మాధురి.. పోటీ చేస్తాను అంటూ.. పరేడ్ మైదానంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్రహితం కోసం పనిచేస్తున్నామని, మాది ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 30నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని, తెలంగాణ విజన్ -2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నామని, రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. Telugu » Telangana » Cm Revanth Reddy Participated In Telangana State Formation Day At Parade Grounds 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Telangana Formation Day Celebrations : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం...