
Dhanush : గత కొన్నాళ్లుగా సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. నార్త్ లో అనేకమంది సినీ సెలబ్రిటీలు పలు పార్టీల్లో ఉండి ఎన్నికల్లో గెలిచారు. సౌత్ లో కూడా చాలా మంది నటీనటులు రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లారు. ఇటీవలే తమిళ్ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టి తమిళనాడు సీఎం అయ్యారు. అనేకమంది సినీ నటీనటులు రాజకీయాల్లోకి వస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తారనే వార్త వైరల్ అవుతుంది. దీనిపై ధనుష్ తండ్రే కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. Also Read – Peddi Collections : ఇలా అయితే కష్టమే.. పెద్ది కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్.. నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో పాల్గొనగా ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై ప్రశ్నలు ఎదురవడంతో ఆయన స్పందిస్తూ.. ఆసక్తి ఉంటే ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్లే హక్కు ఉంది. భవిష్యత్తులో నా కొడుకు ధనుష్, నా మనవళ్ళు కూడా రాజకీయాల్లోకి వెళ్లొచ్చు అని అన్నారు. దీంతో ధనుష్ రాజకీయాల్లోకి వస్తాడు అనే వార్తలకు మరింత బలం చేకూరింది. మరి విజయ్ లాగే కొత్త పార్టీ పెడతాడా లేదా ధనుష్ వేరే ఏదైనా పార్టీలో చేరుతారా చూడాలి. దీనిపై ధనుష్ నుంచి అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ధనుష్ మాత్రం పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు లేకపోయినా సేవా కార్యక్రమాలు మాత్రం నిర్వహిస్తున్నారు. Telugu » Movies » Dhanush Political Entry Comments By His Father After Vijay Became Cm 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Dhanush : గత కొన్నాళ్లుగా సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. నార్త్ లో అనేకమంది సినీ సెలబ్రిటీలు పలు పార్టీల్లో ఉండి ఎన్నికల్లో గెలిచారు. సౌత్ లో...