
RCB : ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచినందుకు ప్రైజ్‌మనీ కింద ఆర్సీబీకి 20 కోట్ల మొత్తం లభించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు ఎలా పంచుకుంటారు అన్న విషయం పై సర్వత్రా ఆసక్తి ఉంది. ఇక ఇదే విషయాన్ని మిస్టర్ నాగ్స్ ఆర్సీబీ ఆటగాడు భువనేశ్వర్ కుమార్‌ను అడిగాడు. 17 ఏళ్ల సీజన్ల పాటు కప్పు కోసం నిరీక్షించిన ఆర్సీబీ ఎట్టకేలకు 18వ సీజన్లో విజేతగా నిలిచింది. అదే ఉత్సాహంలో 19వ సీజన్లోనూ కప్పును ముద్దాడింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబైఇండియన్స్ తరువాత వరుసగా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. RCB bench players : ఛాంపియన్ జట్టులో భాగమై.. ఒక్క మ్యాచ్ ఆడని ఆర్సీబీ ఆటగాళ్లు.. వేలంలో కోట్ల వర్షం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన తరువాత మైదానంలో ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సమయంలోనే ఆర్సీబీ డిజిటల్ హోస్ట్ మిస్టర్ నాగ్స్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పలువురు ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేశాడు. Tim David : ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ ఆటగాడిపై సస్పెప్షన్.. వచ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు దూరం.. ఇక భువనేశ్వర్ కుమార్ దగ్గరకు వచ్చే సరికి మాత్రం 20 కోట్ల ప్రైజ్‌మనీని ఆటగాళ్లు ఎలా పంచుకుంటారని మిస్టర్ నాగ్స్ అడిగాడు. ఇందుకు భువీ ఎంతో తెలివిగా సమాధానం ఇచ్చాడు. నగదును ఎలా పంచుకుంటారు అనే విషయం తనకు తెలియదని, దాని గురించి తెలుసుకోవడానికి తనకు ఎంతో ఆసక్తిగా ఉందని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి వివాదాంలో ఇరుక్కోకుండా భువీ చాలా చక్కగా చెప్పాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Telugu » Sports » How Rcb Players Will Divide 20 Crore Ipl Prize Money Bhuvneshwar Kumar Gets Asked By Mrnags These nine players are not playing in a single match for RCB in IPL 2026 Post match presentation party gatecrashed! Mr. Nags was our toughest challenge of the season, even on the night of the final. Find out what happened, when he spoke to some special guests. 😭😂 pic.twitter.com/ebnwXvWt0G — Royal Challengers Bengaluru (@RCBTweets) June 1, 2026 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. RCB : ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచినందుకు ప్రైజ్‌మనీ కింద ఆర్సీబీకి 20 కోట్ల మొత్తం లభించింది. ఈ మొత్తాన్ని...