
Trump – Netanyahu : లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్‌తో జరుగుతున్న సున్నితమైన చర్చలకు ఈ సంఘర్షణ ఆటంకం కలిగించకుండా వాషింగ్టన్ నివారించేందుకు ప్రయత్నిస్తోంది. Also Read : Donald Trump Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో ఆ పరికరాల తయారీ రంగానికి గుడ్‌న్యూస్.. తగ్గనున్న ధరలు బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు ఆదేశించండం, దక్షిణ లెబనాన్‌లో భూతల కార్యకలాపాలను విస్తరించడం వంటి చర్యల తరువాత ఈ అసాధారణ ఘర్షణ చోటు చేసుకుంది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అయితే, లెబనాన్‌పై దాడులుచేస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ బెదిరించింది. ఈ క్రమంలో నెతన్యాహు తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తున్నారని, ఇరాన్ తో అమెరికా దౌత్య ప్రయత్నాలకు ప్రమాదం కలిగిస్తున్నారని ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘నీకు పిచ్చి పట్టింది. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి. నిన్ను కాపాడుతున్నాను. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. దీనికారణంగా అందరూ ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అంటూ ట్రంప్ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. ఇరాన్ విషయంలో ఇన్నాళ్లూ ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు భిన్న దిశల్లో పయణిస్తున్నట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హెజ్బొల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ వెనక్కు తగ్గుతుందా.. లేదంటే ట్రంప్ ను ధిక్కరించి తన వ్యూహాన్ని అమలు చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. Telugu » International » Us President Donald Trump Reportedly Confronted Benjamin Netanyahu In Tense Call 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Trump – Netanyahu : లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో...