
YS Jagan : అమరావతి రాజధాని పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. వైఎస్ జగన్ తో భేటీ అయిన వారిలో ఉండల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు సహా మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. Also Read : Annamalai : బీజేపీకి అన్నామలై రాజీనామా.. నితిన్ నబిన్‌కు రాజీనామా లేఖ అందజేత..? రైతులతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని అన్నారు. రైతులను బలవంతం పెట్టడం మంచిదికాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. రైతులకు సంతోషపెట్టేలా ఏదైనా జరగాలి. వారిని కష్టపెట్టేలా ఏమీ ఉండకూడదుదని జగన్ అన్నారు. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కులేదు.. ఇప్పుడు మళ్లీ 50వేల ఎకరాలని సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్‌ను సూచించామని జగన్ పేర్కొన్నారు. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్‌పోర్టు అంటున్నారు. మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కానీ, ఇవేమీ చంద్రబాబుకు పట్టదు. భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు 2కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, జీవితమంతా డ్రైనేజీ తవ్వడానికి, జీవితమంతా నీళ్లు ఇవ్వడానికి, జీవితమంతా కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి. దాదాపు రెండు లక్షల కోట్లు దీనికోసమే ఖర్చు చేయాలని జగన్ విమర్శించారు. రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. ఏది చూసినా స్కామే కనిపిస్తోంది. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారు. మావిగన్‌ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కి.మీ. అటు ఇటూ గ్రోత్ కారిడర్‌కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్ అభివృద్ధి చెందుతుందని జగన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ ను కలిసిన తరువాత రాజధాని రైతులు మాట్లాడుతూ.. మా బాధలు చెప్పుకోవడానికి ఎవరూ ఉండటం లేదు. ఎమ్మెల్యే, మంత్రి, అధికారులు ఎవరూ కలవడానికి అవ్వడం లేదు. ఉండవల్లిలో పండని పంటలు లేవు.. అలాంటి పొలాలను ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఏడాది పొడవునా పంటలు పండుతాయి. ఎకరానికి 3లక్షలు సంపాదిస్తాం. మా బాధలన్నీ వైఎస్ జగన్ కు చెప్పుకున్నాం. భూసేకరణ నుండి మా భూములు తప్పించండని వేడుకుంటున్నాం. ప్రతిరోజూ ఏదోక విధంగా మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. జగన్ మాకు అండగా ఉంటానని చెప్పారు. న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. 12ఏళ్లుగా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక భూసేకరణ నిలిపివేస్తామని హామీ ఇచ్చారని జగన్ కలిసిన రాజధాని రైతులు పేర్కొన్నారు. Telugu » Andhrapradesh » Amaravati Capital Area Farmers Meet With Ys Jagan Mohan Reddy 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. YS Jagan : అమరావతి రాజధాని పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. వైఎస్ జగన్...