
Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగం అని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే నేడు ఎమ్మెల్యేలు అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోకి ఎలా వస్తావో చూస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వైఎస్ హయాంలో యూత్ కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తే తన్ని తరిమేశాం అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ”నేను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు కాబట్టి చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము పోటీ చేస్తాం. ఎప్పుడూ పోటీ చేస్తుంటాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగతా. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ఎదుర్కొంటాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఈ తెలంగాణ నా భారత దేశంలో అంతర్భాగం. మీరు కూర్చోబెట్టి రాకూడదు అంటే భరించాం. పదేళ్లకు పైగా భరించాము. దీనికి ఫుల్ స్టాప్ పెడతాం మేము. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో కూర్చున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఎమ్మెల్యేలు అయ్యారు. 12 ఏళ్లు తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. తెలంగాణలోకి ఎలా అడుగు పెడతారో చూస్తాం అంటున్నారు. ఇలాంటి ప్రగల్బాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ వాళ్లు మాట్లాడితే… ఆరోజు వారిని తన్ని తగలేశాం” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్ Telugu » Telangana » Pawan Kalyan Key Comments On Janasena Contest In Telangana 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్...