
బచ్చన్నపేట, జూన్ 02 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు ఎండీ జావిద్‌ను జనగామ జిల్లా బచ్చన్నపేట మండల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. అలాగే తెలంగాణ అమరవీరులకు బచ్చన్నపేట చౌరస్తాలో అమర వీరుల స్థూపం వద్ద ఘన మంగళవారం నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిదన్నారు. వారిని గౌరవించుకోవడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, నాయకులు ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, కొండి వెంకటరెడ్డి, పులిగిల్ల పూర్ణచందర్, సిద్ధిరాం రెడ్డి, ఉపసర్పంచ్ బైరి రజిత, బొమ్మెన ఆంజనేయులు, అల్వాల ఎల్లయ్య. ఎండీ షబ్బీర్, శివరాత్రి రాజు, మచ్చ సతీష్, గంధమల్ల మహేష్, కర్ణాకర్, దిలీప్, ఎండీ అజీమ్, చింతల వెంకటయ్య పాల్గొన్నారు. # 8-2-603/1/7,8&9, Krishnapuram, Road No. 10, Banjara Hills, Telangana - 500034. Phone: +91 40 2329 1999 Website: +91-40-23291163 digitalsales@tppl.news The content of this site is © 2026 Telangana Publications pvt. Ltd బచ్చన్నపేట, జూన్ 02 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు ఎండీ జావిద్‌ను జనగామ జిల్లా బచ్చన్నపేట మండల బీఆర్ఎస్ నాయకులు...