
telangana weather report today: ఎల్నినో ప్రభావం వల్ల తెలంగాణలో హీట్ వేవ్ కొనసాగుతూనే ఉంటుంది. ఎండల తీవ్రత పెరగడం వల్ల వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేసింది. ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ, మరోవైపు అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక చల్లని వార్త చెప్పింది. పగటిపూట విపరీతమైన ఎండలు, ఉక్కపోత ఉండగా, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాతావరణం కొంత చల్లబడుతుంది, అక్కడక్కడా వర్షాలు పడవచ్చు. అంటే ఒకే రోజులో ఎండలు, వర్షాలు రెండు రకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. అకాల వర్షాలు కురిసే సమయంలో పిడుగులు