
Ponnam Prabhakar – Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. మిస్టర్ పవన్ కల్యాణ్… ఇది మా అయ్య జాగీరే అని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ.. 4 కోట్ల మంది ప్రజల జాగీరు. మీ అయ్య జాగీరు కాదు అని ఎదురుదాడికి దిగారు. ”పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి చేసేదేంటి? పవన్ పెయిడ్ ఆర్టిస్ట్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా పవన్ తో ఒక క్యారెక్టర్ చేయిస్తా. తెలంగాణపై పవన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి పవన్. గద్దర్ కు కార్ కొనిచ్చినా అని చెప్పినందుకు ముందు క్షమాపణ చెప్పు. చనిపోయిన వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? తనకి ఆంధ్రాలోనే దిక్కు లేదని పవన్ చెప్పుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రా వాళ్ళని మేము ఏమీ అనలేదు. మేం ఆంధ్రా వాళ్ళని ఏదో అన్నట్టు పవన్ అబద్ధాలు చెబుతున్నారు. పార్లమెంటులో ఏ బిల్లు చేసినా తలుపులు మూసే పాస్ చేస్తారు. కొండగట్టుకు ఇచ్చిన పైసలు మీ అయ్యా జాగీరా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీటింగ్ పెట్టడం గెలకడం కాదా? పవన్ తిరిగితే జనాలు వస్తారు. కానీ, ఓట్లు వేయరు. పవన్ వచ్చినా, పోయినా మాకేం సంబంధం లేదు. తెలంగాణ ఎప్పుడైనా ఏపీ ప్రజలను స్వాగతిస్తూనే ఉంటుంది. సినిమా నటుడిగా పవన్ ఎక్కడ తిరిగినా మాకేం ఇబ్బంది లేదు” అని కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్ Telugu » Telangana » Minister Ponnam Prabhakar Counter To Pawan Kalyan 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Ponnam Prabhakar – Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ...