
Mla Anirudh Reddy: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమలో ప్యాకేజ్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ల సినిమాలో నటిస్తారు.. రాజకీయాల్లో సైతం ప్యాకేజీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే పవన్ మద్దతిస్తున్నారు అని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ ఆయనకి కూడా మద్దతిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును జైల్లో కలవడమే పవన్ ప్లస్ పాయింట్ అని అన్నారు. ”పవన్ కల్యాణ్ తెలంగాణకి క్షమాపణ చెప్తారని అనుకున్నా. నరదృష్టి ఉన్న దగ్గరికి పవన్ ఎందుకు రావాలి? పవన్ వెళ్ళి గుజరాత్ లో పోటీ చేయాలి. నల్లగా అయిపోతాననే పవన్ విజయవాడ వెళ్ళడం లేదు. గ్లామర్ కాపాడుకోవడం కోసమే పవన్ హైదరాబాద్ లో ఉంటున్నారు. టీటీడీ డబ్బులపై కూడా పవన్ రాజకీయం చేస్తున్నారు? పవన్ ఇంగ్లీషులో మాట్లాడింది అమిత్ షా కి అర్థం కావడానికే. కేసీఆర్, అమిత్ షాను ఇంప్రెస్ చేయడానికే పవన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి భూముల వ్యవహారమే తెలీదు. పవన్ కబ్జా చేసిన భూమి దగ్గరికి వెళ్తే కేసులు పెడతారా? రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి పవన్ డిప్రెషన్ లో ఉన్నారు” అని అనిరుధ్ రెడ్డి అన్నారు. Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్ Telugu » Telangana » Mla Anirudh Reddy Strong Counter To Pawan Kalyan Comments 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Mla Anirudh Reddy: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు?...