
Raghunandan Rao: తెలంగాణలో జనసేన సభకు అనుమతించకపోవడంపై తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్ సెట్ తో ఉందని టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సభ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమేంటి అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. ”పవన్ కల్యాణ్ ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేశంలో అనేకమంది అనేక ప్రాంతాలకు వెళ్లి మాట్లాడుతుంటాం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మీడియాతో చిట్ చాట్ చేస్తానే ఉంటారు. మరో రాష్ట్ర డిప్యూటీ సీఎం పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ లేదా సభ పెడితే అంత ఆందోళన చెందాల్సిన అవసరం నాకైతే కనిపించడం లేదు. ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తారు. కేసీఆర్ వేరే రాష్ట్రానికి పోయి రైతులకు పైసలు ఇచ్చి వస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. పవన్ కల్యాణ్ ఎన్డీయేలో భాగం. ఆయనను మేము ఎలా వేరు చేస్తాం. ఆయన ఏ రాష్ట్రంలో ఉంటే ఏంటి? ఎన్డీయే భాగస్వామ్య కూటమిలో ఉన్నారు, ఉంటారు కూడా. ఎన్డీయే భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వారు వేరే రాష్ట్రాలకు పోవద్దని ఏమైనా ఉందా? తప్పకుండా పోతాం. దాన్ని మీరు అడ్డుకునేది ఏముంది? అని ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్ Telugu » Andhrapradesh » Raghunandan Rao Slams Congress Leaders In Pawan Kalyan Meeting Issue 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Raghunandan Rao: తెలంగాణలో జనసేన సభకు అనుమతించకపోవడంపై తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్ సెట్ తో ఉందని టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు...