
Buchibabu sana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్ర పెద్ది. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను ముమ్మరం చేసింది. కాగా, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అద్భుతమైన స్వరాలను అందించారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు.. రెహమాన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. Raveena Tandon: నటి రవీనా టండన్ ఇంట్లో రూ.25 లక్షల వజ్రాభరణాల చోరీ.. పనిమనిషే పక్కా ప్లాన్ చేసి ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేయడం తన జీవితంలోనే మర్చిపోలేని అనుభూతి అని బుచ్చిబాబు ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయనతో సాగిన జర్నీ ఒక అద్భుతమని, ఆయన అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని కొనియాడారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో బుచ్చిబాబు(Buchibabu sana) ఒక క్రేజీ నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. రెహమాన్ వర్కింగ్ స్టైల్‌కు తాను పూర్తిగా ఫిదా అయ్యానని చెప్పారు. అందుకే ఇకపై తాను తీయబోయే అన్ని సినిమాలకూ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటారని స్పష్టం చేశారు. ఒక దర్శకుడు సంగీత దర్శకుడిపై ఈ స్థాయి నమ్మకాన్ని ఉంచడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్ జూన్ 4న థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. దీంతో, బుచ్చిబాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Telugu » Movies » Peddi Director Buchi Babu Announced That Ar Rahman Will Compose Music For All His Upcoming Films 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Buchibabu sana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్ర పెద్ది. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న...