
Farmers | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి కండ్లు కాయలు చేసేలా ఎదురుచూసినా అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వడ్లు, మక్కలు కొను... Farmers | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి కండ్లు కాయలు చేసేలా ఎదురుచూసినా అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలంటే మండుటెండలో రోడ్లెక్కి ఆందోళన చేసినా కనికరించడం లేదు. నాగర్కర్నూల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు తాడూరు మండలంలో ఇంద్రకల్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఇంద్రకల్ గ్రామంలో మొక్కజొన్న సేకరణ గోదాముల వద్ద పది రోజులుగా మొక్కజొన్న ట్రాక్టర్లతో నిరీక్షిస్తున్న రైతులు అధికారుల నిర్లక్ష్య వైఖరితో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా మొక్కజొన్న ట్రాక్టర్లు, లారీలు భారీగా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఒక గోదాం నిండిందని మరొక గోదాంకు పంపించారని, ఆ గోదాంలో కూడా నిండుతుందని.. మా పరిస్థితి ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. తాము రోజుల తరబడి తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నామని.. కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఆందోళనకు దిగిన మొక్కజొన్న రైతులు తాడూరు మండలంలో ఇంద్రకల్ రోడ్డు మొక్కజొన్న సేకరణ గోదాముల వద్ద పది రోజులుగా మొక్కజొన్న ట్రాక్టర్లతో రైతుల నిరీక్షణ రోడ్డుకు ఇరువైపులా భారీగా కిలోమీటర్ల మేర నిలిచిపోయిన మొక్కజొన్న ట్రాక్టర్లు,… pic.twitter.com/l9fRxOiucF — Telugu Scribe (@TeluguScribe) May 25, 2026 # 8-2-603/1/7,8&9, Krishnapuram, Road No. 10, Banjara Hills, Telangana - 500034. Phone: +91 40 2329 1999 Website: +91-40-23291163 digitalsales@tppl.news The content of this site is © 2026 Telangana Publications pvt. Ltd