ప్రకాశం జిల్లా, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. లారీలో తవుడు బస్తాల కింద దాచి తరలిస్తున్న వందల కిలోల గంజాయిని చూసి పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలు ఏమైందంటే..?

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిపై ఒక లారీ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో ఆ మార్గంలో వేగంగా వచ్చిన ఒక బైక్, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ప్రమాదంతో వెలుగుచూసిన గంజాయి స్మగ్లింగ్

ప్రమాద సమాచారం అందుకున్న ఒంగోలు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని అక్కడే వదిలేసి చాకచక్యంగా పరారయ్యారు. డ్రైవర్ ప్రవర్తన, పరారైన తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు లారీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లారీ లోపల తవుడు బస్తాల లోడ్ లాగా కనిపించినప్పటికీ, ఆ బస్తాల కింద భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లను దాచినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక తనిఖీల ప్రకారం లారీలో సుమారు 500 కేజీలకు పైగా గంజాయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీని మార్కెట్ విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం.

మన్యం టు తమిళనాడు.. గుట్టు రట్టయిందిలా!

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ గంజాయి రవాణాకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భారీ గంజాయి నిల్వలను మన్యం ప్రాంతం (ఏజెన్సీ) నుంచి తమిళనాడుకి తరలిస్తున్నట్లు ఒంగోలు పోలీసుల విచారణలో తేలింది. ప్రమాదానికి కారణమైన, గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది?, పరారైన డ్రైవర్, క్లీనర్ ఎవరు?, మన్యం ప్రాంతంలో వీరికి గంజాయి సరఫరా చేసింది ఎవరు?, తమిళనాడులో ఎవరికి చేరవేయాలి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. జాతీయ రహదారులపై నిఘాను మరింత తీవ్రం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

‘సర్’ను సీరియస్గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

ప్రకాశం జిల్లా, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు...