
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది'. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించడంతో నటి జాన్వీ కపూర్ భయంతో ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అసలేం జరిగిందంటే..!విజయవాడలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్, జాన్వీ వేదికపై పక్కపక్కనే కూర్చుని ఉండగా.. ఓ అభిమాని ఆయన్ను కలిసేందుకు వేదికపైకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన ఆ అభిమాని, జాన్వీ కూర్చున్న సోఫా హ్యాండిల్‌పై పడిపోయాడు. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. వెంటనే అప్రమత్తమైన రామ్ చరణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కెవిన్ కుంటా.. ఆ అభిమానిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. 'ఇంటర్నేషనల్ లెవెల్ సెక్యూరిటీ' అంటూ భద్రతా సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.అయితే, ఈవెంట్ ముగిసిన తర్వాత రామ్ చరణ్ అదే అభిమానిని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఈ భేటీలో ఆ అభిమాని చరణ్‌కు కృతజ్ఞతలు చెప్పి, ఆయన పాదాలకు నమస్కరించాడు.బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రేపు (జూన్ 4న) ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది'. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని అత్యుత్సాహం...