RBI Gold: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల మన ఇంధన దిగుమతుల బిల్లు భారీగా పెరిగింది. అలాగే ఈ ఏడాది 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లలో రూ.2.25 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విదేశీ మదుపరులు విక్రయించారు. తమ పెట్టుబడులను తీసుకెళ్లారు. ఈ కారణాలతో అమెరికా డాలర్‌కు గిరాకీ బాగా పెరిగింది. రూపాయి విలువ పడిపోతోంది. దీంతో మన దగ్గర ఉన్న విదేశీ మారకపు నిల్వల విలువ భారీగా పడిపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫారెక్స్ నిల్వలు రూ.728.49 బిలియన్ డాలర్లుగా ఉండగా అది 4 నెలల్లోనే 47 బిలియన్ డాలర్లు తగ్గిపోయి 681.40 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వీటిని కాపాడుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.57 వేల కోట్లు విలువైన పసిడి నిల్వలను విక్రయించినట్లు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్ బర్గ్ తెలిపింది. ప్రభుత్వం ఏం చేస్తోంది?ఫారెక్స్ నిల్వలు వృథాగా పోకుండా చూసేందుకు బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు కంటే పెంచి 15 శాతానికి చేసింది. ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉన్నా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆర్థిక స్థితి దెబ్బతినకుండా చూసేందుకు పెట్రోల్, డీజిల్ ధరలనూ పెంచింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ తన వద్ద ఉన్న నిల్వల్లో రూ.57 వేల కోట్ల పసిడిని మే 22తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో విక్రయించింది. తద్వారా విదేశీ కరెన్సీ ఆస్తులకు ఈ మొత్తాన్ని జమ చేసుకుంది. మన ఫారెక్స్ నిల్వల్లో విదేశీ కరెన్సీ ఆస్తులు 543.032 బిలియన్ డాలర్లు కాగా పిసిడి నిల్వలు 114.786 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారమే 2 వారాల్లో పసిడి నిల్వల విలువ 6 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. బంగారం ఎందుకు విక్రయిస్తోంది?దేశ ఎగుమతుల కంటే దిగుమతులు బిల్లు భారీగా పెరుగుతోంది. దీంతో కరెంటు ఖాతా లోటు అంతకంతకూ అధికమవుతోంది. రూపాయి విలువ ఈ సంవత్సరంలో 7 శాతం వరకు పతనం అయ్యేందుకు కారణమైంది. అందుకే మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో డాలర్ నిల్వలను పెంచుకుని, రూపాయిని బలోపేతం చేయడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టింది. అందుకే బంగారం విక్రయిస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో ఆర్బీఐ వద్ద 880.52 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటిలో 77 శాతం నిల్వలు భారత్‌లోనే ఉన్నాయి. అంతకు 6 నెలల క్రితం మన దేశంలో ఉన్న బంగారం నిల్వలు 66 శాతంగా ఉండడం గమనార్హం. మిగిలిన బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ దగ్గర ఉండేది. RBI Gold: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల మన ఇంధన దిగుమతుల బిల్లు భారీగా పెరిగింది. అలాగే ఈ ఏడాది 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లలో రూ.2.25 లక్షల కోట్ల విలువైన...