తొలి చిత్రం ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు దర్శకుడు బుచ్చిబాబు సానా . ఇప్పుడు ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం ‘పెద్ది’పై పాన్ ఇండియా స్ఠాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఈ యాక్షన్ డ్రామా గురువారం (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానుల కోలాహలం ఈరోజే మొదలుకానుంది. బుధవారం (జూన్ 3) సాయంత్రం నుంచే థియేటర్లలో ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి అప్పుడే షురూ అయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించి, సినిమా విశేషాలను పంచుకున్నారు.* 'పెద్ది' మూవీకి తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్.. టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న డల్ ఫేజ్‌ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందా అన్న ప్రశ్నకు బుచ్చిబాబు స్పందిస్తూ.. తన కెరీర్ అంతా ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లోనే సాగుతుందేమోనని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘ఉప్పెన’ విడుదల సమయంలోనూ కరోనా భయాలు, థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేదని గుర్తుచేసుకున్నారు. కానీ సినిమా బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా వస్తారని ఆ చిత్రంతో రుజువైందని, ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం తాను విడుదల తేదీలను కాకుండా, ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ టాక్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్టీఆర్‌తో చేయాలనుకున్న లైన్ వేరని, ‘పెద్ది’ కథను కేవలం రామ్ చరణ్‌ను మనసులో పెట్టుకునే సిద్ధం చేశానని స్పష్టం చేశారు. చరణ్ ఒక ఇంటర్వ్యూలో తనకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయాలని ఉందని చెప్పడం విన్న తర్వాత ఈ స్క్రిప్ట్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇది పూర్తి కల్పిత కథ అయినప్పటికీ, విజయనగరం ప్రాంతానికి చెందిన ఒక సాధారణ యువకుడి చుట్టూ తిరుగుతుందని వెల్లడించారు. సినిమాలో చరణ్ కంటే కూడా ‘పెద్ది’ అనే ఆ పాత్ర హవాయే ఎక్కువగా కనిపిస్తుందని, అతని ఆట, జీవితంలోని ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెబుతూ అంచాల్ని మరింత పెంచేశారు. రామ్ చరణ్ నటన, అంకితభావం గురించి బుచ్చిబాబు ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. కుస్తీ సన్నివేశాల చిత్రీకరణలో చరణ్‌కు దెబ్బలు తగిలినా లెక్కచేయకుండా నటించారని కొనియాడారు. ఒక దశలో చరణ్ కంటికి గాయమైనప్పుడు తనకు చాలా భయమేసిందని, చిరంజీవి గారు తిడతారేమోనని కంగారు పడ్డానని నవ్వుతూ చెప్పారు. అయితే చిరంజీవి గారికి ఫోన్ చేయగా, ఆయన ఎంతో కూల్‌గా ఆ రికార్డైన వీడియో ఒకసారి పంపించు అని మాత్రమే అన్నారని గుర్తుచేసుకున్నారు. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, జాన్వీ కపూర్ వంటి ప్రతి ఒక్కరి పాత్రలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయని, ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తాయని తెలిపారు.* అభిమానానికి పరాకాష్ఠ: దేవుడి గదిలో విజయ్ విగ్రహం.. నిత్య పూజలపై నెటిజన్ల ఫైర్ సెకండాఫ్‌కి సుకుమార్ ఫిదా కథ కోసం ఎలా కష్టపడాలో తన గురువు సుకుమార్ దగ్గరే నేర్చుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. తాను రాసుకున్న కథలను ఆయనకు వినిపిస్తానని, సలహాలు ఇస్తూనే ‘నేనేం చెప్పినా వీడు తనకు నచ్చిందే చేస్తాడు’ అని సుకుమార్ సరదాగా అంటుంటారని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సుకుమార్.. తనకు ‘పెద్ది’ సెకండాఫ్ చాలా బాగా నచ్చిందని మెచ్చుకున్నట్లు బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తో ఉంటుందా అన్న ప్రశ్నకు.. ఆయన పిలిస్తే పరుగెత్తుకుంటూ వెళ్లి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, ఒక మంచి స్క్రిప్ట్ కూడా రెడీ చేశానని చెప్పుకొచ్చారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు దర్శకుడు బుచ్చిబాబు సానా . ఇప్పుడు ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం ‘పెద్ది’పై పాన్...