
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంల... పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish rao slams on cm revanth reddy govt on maize and paddy procurement: తెలంగాణలో రాజకీయాలు మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఒకవైపు భానుడు ఉక్కపోతతో చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీ నేతలు సైతం పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరింత అగ్గిని రాజేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వడ్లు, మొక్కజొన్నల కొనుగోలు అంశం వివాదంగా మారింది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు క్లియర్ గా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపించి వడ్డు కొనుగోలుచేయాలని, బస్తాలు ఎక్కడ కూడా తక్కువ పడకుండా చూడాలన్నారు. నెగ్లీజెన్సీ వహిస్తే ఎవరి మీద అయిన కేసులు పెట్టాలన్నారు. కలెక్టర్లు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలకు సైతం వెనుకాడబొమని హెచ్చరించారు. కానీ గ్రౌండ్ లెవల్ లో సిట్యువేషన్ దీనికి భిన్నంగా ఉంది. ఇంకా పలు చొట్ల నత్త నడకన ధాన్యం కొనుగోలు సాగుతున్నాయి. సంచుల కొరతతో రైతులు తాము పండించిన ధాన్యంను ఎక్కడ నిల్వచేయాలని తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు దళారులు తక్కువ ధరకే ధాన్యం అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక అకాల వర్షాలు సైతం రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ధాన్యం కొనుగొళ్ల రచ్చ వేళ తెలంగాణ వ్యాప్తంగా 12 మంది వరకు రైతులు తమ ప్రాణాల్ని కొల్పొయారు. ధాన్యం కొనుగోలు చేయాలని అన్ని జిల్లాల రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. తమ గోసను తీసుకొవద్దని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల గుండెలు ఆగిపోయినా రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని రైతులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి నెలరోజులైనా ఇంత వరకు సంచులు కూడా ఇవ్వలేదని రైతులు చెబుతున్నారని అన్నారు. Read more: Brs Harish rao: బరాబర్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం.. హరీష్ రావు సంచలన ప్రకటన.. మ్యాటర్ ఏంటంటే..?.. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చుని మెషిన్ మోడ్ లో వడ్లుకొనాలని అంటున్నాడని, కానీ ఆయనకు కావాల్సింది కమిషన్ మోడ్ అంటూ సెటైర్లు వేశారు. రోహిణి కార్తె వచ్చిన సగంకూడా వడ్ల కొనుగోలుజరగలేదన్నారు. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్లుకొనుగోలు చేయడం చూసి నత్తలు కూడా సిగ్గుపడతాయని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి