
డ్రైవర్లకు, వాహన యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, ఇంటికి కాగితం చలాన్లు రావడం అనే పాత పద్ధతికి కాలం చెల్లిపోయింది. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా సిగ్నల్ జంప్ చేసినా లేదా హెల్మెట్ లేకుండా దొరికిపోయినా.. చలాన్లు నేరుగా మీ వాట్సాప్, ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్‌కే వచ్చేస్తుంది. "మాకు మెసేజ్ రాలేదు.. మేము చూసుకోలేదు" అంటూ ఇకపై సాకులు చెబితే అస్సలు కుదరదు. ఈ సరికొత్త డిజిటల్ సిస్టమ్‌ను తీసుకొస్తూ రవాణా శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన జూన్ 2 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని వాహన యజమానులంతా తమ ప్రస్తుత వాడుకలో ఉన్న మొబైల్ నంబర్‌ను, ఈ-మెయిల్ ఐడీని కేంద్ర ప్రభుత్వ అధికారిక ‘వాహన్’ (Vahan) పోర్టల్‌లో కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం 30 రోజులు టైమ్ ఇచ్చింది. ఒకవేళ మీరు గడువు ముగిసేలోపు నంబర్ అప్డేట్ చేసుకోకపోతే, లేదా పాత నంబర్‌నే అలాగే వదిలేస్తే.. ఆ పాత నంబర్‌కు వెళ్లిన చలాన్లు మీకు అందినట్లుగానే అధికారులు చట్టబద్ధంగా భావిస్తారు. నాకు తెలియదు అని తప్పించుకోవడానికి వీల్లేకుండా ఈ రూల్‌ను చాలా స్ట్రిక్ట్‌గా డిజైన్ చేశారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం.. ట్రాఫిక్ ఉల్లంఘన జరిగిన కేవలం మూడు రోజుల్లోనే ఈ-చలాన్లు డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్‌గా పంపాల్సి వస్తే 15 రోజుల్లోగా సదరు వ్యక్తికి చేరాలి. అయితే, వాట్సాప్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా చలాన్లు అందిన తర్వాత వాహనదారుడికి జరిమానా చెల్లించడానికి లేదా దాన్ని సవాల్ చేయడానికి గరిష్ఠంగా 45 రోజుల గడువు ఉంటుంది. ఈ 45 రోజుల్లోగా చలాన్లు క్లియర్ చేయకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. పెండింగ్ చలాన్లు అలాగే ఉంచేస్తే, సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్, లేదా బండి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఎలాంటి అప్లికేషన్లను రవాణా శాఖ ప్రాసెస్ చేయదు. అంటే మీ లైసెన్స్, ఆర్సీ బ్లాక్ అయినట్లే. కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా వేరే బండి నంబర్ పడటం వల్లనో, సాంకేతిక లోపాల వల్లానో మనకు తప్పుడు చలాన్లు వస్తుంటాయి. ఇలాంటి టైమ్‌లో కంగారు పడాల్సిన అవసరం లేదు. చలాన్లు తప్పనిపిస్తే దాన్ని ఆన్లైన్ ద్వారానే సవాల్ చేసే ఛాన్స్ ప్రభుత్వం కల్పించింది. నిర్దేశిత ఆన్లైన్ పోర్టల్‌లో తగిన ఆధారాలు (ఫోటోలు లేదా డాక్యుమెంట్లు) అప్లోడ్ చేసి అప్పీల్ చేసుకోవచ్చు. వీటిని పరిష్కరించడానికి జిల్లావారీగా పోలీస్, రవాణా శాఖ అధికారులను గ్రీవెన్స్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వీరు మీ ఫిర్యాదును పరిశీలించి చలాన్లు తప్పని తేలితే, దాన్ని రద్దు చేసి ఆ ఆర్డర్ కాపీని డైరెక్ట్‌గా మీ మొబైల్‌కే పంపుతారు. ఒకవేళ మీ అభ్యంతరాన్ని అధికారి తిరస్కరిస్తే, ఆ ఆర్డర్ వచ్చిన 30 రోజుల్లోగా ఫైన్ కట్టాలి. లేదంటే 50% డిపాజిట్ చేసి కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో లోకల్ ఆన్లైన్ చలాన్లు సిస్టమ్ నడుస్తోంది. దీనికి ప్రభుత్వం 6 నెలల గడువు విధించింది. రాబోయే ఆరు నెలల్లోగా తెలంగాణ పోలీస్, రవాణా శాఖలు తమ పాత చలాన్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘సారథి–వాహన్’ ఈ-చలాన్ సిస్టమ్‌కు పూర్తిగా బదిలీ చేయాలని స్పష్టం చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా చలాన్ల ప్రక్రియ అంతా ఒకే తాటిపైకి వస్తుంది. అలాగే, ఒక ఏడాదిలో ఏదైనా వాహనం లేదా వ్యక్తి 5 కంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, దాన్ని సీరియస్ కేస్‌గా పరిగణిస్తారు. డ్రైవర్లకు, వాహన యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, ఇంటికి కాగితం చలాన్లు రావడం అనే పాత పద్ధతికి కాలం చెల్లిపోయింది. మీరు...