
Gold Ornaments Worth Rs 33 Lakh Offered: తిరుపతి నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తిరుమల శ్రీవారు అపూర్వమైన కానుకను అందించారు. సుమారు రూ. 33 లక్షల విలువైన స్వర్ణాభరణాలను బహుమతిగా తిరుమల శ్రీవారి తరఫున సమర్పించారు. సాధారణంగా స్థానిక ఆలయాల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు ఇటువంటి ఆభరణాలను అందించడం సాధారణం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. నారాయణవనంలోని బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తిరుమల శ్రీవారి తరపున అపూర్వమైన కానుక అందజేశారు. సుమారు రూ.33 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తిరుమల నుండి తరలించి సమర్పించారు. ఈ ఆభరణాలలో ముఖ్యంగా సీమ కమలాలు, నవరత్నాలతో కూడిన రెండు పేటల బంగారు హారాలు, బంగారు లక్ష్మీకాసులమాల ఉన్నాయి. తిరుమల శ్రీవారి తరపున డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఈ ఆభరణాలను నారాయణవనం ఆలయ డిప్యూటీవో శ్రీమతి నాగరత్నకు అందజేశారు. తదనంతరం మంగళ వాయిద్యాల మధ్య ఆ ఆభరణాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పూల మూర్తి సన్నిధిలో వాటిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి అలంకరించారు. శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా.. ఆరవ రోజు మంగళవారం రాత్రి శ్రీనివాస దర్బార్ అలంకారంలో స్వామివారు గజా వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఆధ్యాత్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక బుధవారం ఉదయం 7:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. Gold Ornaments Worth Rs 33 Lakh Offered: తిరుపతి నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తిరుమల శ్రీవారు అపూర్వమైన కానుకను అందించారు. సుమారు రూ. 33 లక్షల విలువైన...