
Kollywood: కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్ సెట్లో ఒక ఘోర ప్రమాదం సంభవించింది. చెన్నై(Kollywood) ఒట్టేరి పరిసరాల్లోని ప్రముఖ బిన్నీ మిల్స్ ప్రాంగణంలో ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సెట్స్‌లో ఉన్న ఒక గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. Vijay Thalapathy: దేవుడి గదిలో హీరో విజయ్ విగ్రహం.. నిత్యం పూజలు, హారతులతో పూజలు చేస్తున్న అభిమాని.. వీడియో వైరల్ ఈ ఆకస్మిక ప్రమాదం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. సిలిండర్ పేలుడు తీవ్రతకు మదన్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు సిబ్బందికి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. వీరితో పాటు మరో పది మందికి పైగా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దురదృష్టకర సంఘటన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ప్రమాదం నుండి ఎస్ జె సూర్యతో పాటు మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులు సురక్షితంగా బయటపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. Telugu » Movies » Fire Accident At Kollywood Sj Surya Killer Movie Shooting Sets Fire accident at sj surya killer movie shooting sets 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Kollywood: కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్ సెట్లో ఒక ఘోర ప్రమాదం సంభవించింది. చెన్నై(Kollywood) ఒట్టేరి పరిసరాల్లోని...