
Vijay Thalapathy: తమిళనాడులో సినీ తారలు, రాజకీయ నాయకులపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్(Vijay Thalapathy) పట్ల తిరుచ్చికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే అభిమాని తన అతి భక్తిని చాటుకున్నాడు. తన ఇంట్లోని పూజా గదిలో విజయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నిత్యం దేవుడిలా హారతులు ఇస్తూ పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. Yash: రియల్ హీరో అనిపించుకున్న ‘కేజీఎఫ్’ యశ్.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్! సినిమా, రాజకీయ రంగాల్లోని వ్యక్తులను గౌరవించడం మంచిదే అయినా, ఇలా దేవుళ్లతో సమానంగా పూజించడం సరైన సంస్కృతి కాదని కొందరు విమర్శిస్తున్నారు. అయితే తమిళనాడులో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదని, గతంలోనూ అనేకమంది ప్రముఖులకు ఇక్కడ గుడులు కట్టారని మరికొందరు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పూజల వీడియో నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. గతంలో తమిళనాడులో నటీమణులు ఖుష్బూ, నమితలకు అభిమానులు ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించి పూజలు చేసిన సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రులు ఎం.జి. రామచంద్రన్, జయలలితలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా అభిమానులు విగ్రహాలు, గుడులు ఏర్పాటు చేసి తమ ఆరాధనను చాటుకున్నారు. ఆ సంస్కృతిని కొనసాగిస్తూ ఇప్పుడు విజయ్ అభిమాని చేసిన పని చర్చల్లో నిలిచింది. Telugu » Movies » A Fan Builds Temple Inside His Home For Hero Vijay And Doing Poojas A fan builds temple inside his home for hero Vijay and doing puja daily 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Vijay Thalapathy: తమిళనాడులో సినీ తారలు, రాజకీయ నాయకులపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ...