
కృష్ణా జిల్లాలోని స్వామి ఆలయ ఆవరణలో ఓ భక్తురాలు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. రాత్రి సమయంలో స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఆమె.. ఆలయ ప్రాంగణంలోనే నిద్రపోయింది. కృష్ణా జిల్లా, జూన్ 3: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఓ భక్తురాలు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. రాత్రి సమయంలో స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఆమె.. ఆలయ ప్రాంగణంలోనే నిద్రపోయింది. తెల్లవారుజామున చూడగా ఆమె మృతిచెందినట్లు తోటి భక్తులు చెబుతున్నారు. మృతురాలు ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు ప్రాంతానికి చెందిన మానుపాటి శ్రీదేవిగా గుర్తించారు. ఆమె స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చి, రాత్రి ఆలయ ఆవరణలోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున ఇతర భక్తులు ఆమెను పిలిచినా స్పందన లేకపోవడంతో మృతి చెందినట్లు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భక్తురాలి మృతికి కారణాలు ఏమిటనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లాలో నాటు తుపాకీతో బెదిరింపులు.. ఢీ జోడి డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదం Home » Andhra Pradesh » Krishna » mopidevi subramanya swamy temple devotee found dead krishna district suchi ABN , Publish Date - Jun 03 , 2026 | 09:54 AM