
మనం ఎక్కడికైనా టూర్‌కి వెళ్లినప్పుడు దారి తప్పినా లేదా నీళ్లు అయిపోయినా ఎవరినైనా అడిగితే.. వారు కేవలం దారి చూపించడమో లేదా ఒక బాటిల్ నీళ్లు ఇవ్వడమో చేస్తారు. కానీ, జపాన్ పర్యటనలో ఉన్న ఆదిత్య పార్ఖీ అనే భారతీయ కంటెంట్ క్రియేటర్‌కు మాత్రం నమ్మశక్యం కాని, మర్చిపోలేని ఒక అద్భుత అనుభవం ఎదురైంది. జపాన్‌లోని అమామీ (Amami) అనే దక్షిణ ద్వీపంలో హైకింగ్ (కొండల్లో నడక) చేస్తున్న సమయంలో అతడి వద్ద ఉన్న తాగునీరు అయిపోయింది. సమీపంలో కెఫే లేదా షాప్ ఎక్కడుందో తెలియక, పక్కనే ఉన్న ఒక ఇంటికి వెళ్లి దారి అడిగాడు. తీరా చూస్తే ఆ నీళ్ల అన్వేషణ కాస్తా.. ఒక అపరిచిత ఇంట్లో అద్భుతమైన లంచ్ ఇన్విటేషన్గా, గుండెను హత్తుకునే సంభాషణగా మారిపోయింది.ఆదిత్య పార్ఖీ జపాన్ చుట్టుపక్కల తన ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతడు షేర్ చేసిన తాజా వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో.. ఆదిత్య ఒక జపనీస్ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి "నన్ను క్షమించండి, ఇక్కడ నీళ్లు దొరికే కెఫే ఏదైనా ఉందా?" అని ఎంతో మర్యాదగా అడిగాడు. దానికి ఆ వృద్ధుడు కేవలం దారి చూపించి ఊరుకోకుండా, ముఖంపై పెద్ద నవ్వుతో లోపలికి వెళ్లి.. నీళ్లకు బదులు 'జ్యూస్ తాగుతావా?' అని అడిగి మరీ బాటిల్, గ్లాస్ తెచ్చి స్వయంగా సర్వ్ చేశాడు. కేవలం సహాయం కోసం అడిగిన ఆ చిన్న ప్రశ్న, ఆ తర్వాత ఒక మనం ఎక్కడికైనా టూర్‌కి వెళ్లినప్పుడు దారి తప్పినా లేదా నీళ్లు అయిపోయినా ఎవరినైనా అడిగితే.. వారు కేవలం దారి చూపించడమో లేదా ఒక బాటిల్ నీళ్లు ఇవ్వడమో చేస్తారు. కానీ, జపాన్ పర్యటనలో...