
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్లో చర్చనీయాంశమైన ‘డాన్ 3’ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. తనపై నిషేధం విధించిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సంస్థకు మంగళవారం రణ్వీర్ (Ranveer Singh) లీగల్ నోటీసులు పంపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు తమకు నోటీసులు అందినట్లు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ (FWICE) చీఫ్ అడ్వైజర్, ఫిల్మ్‌మేకర్ అశోక్ పండిట్ ధ్రువీకరించారు. దీనిపై ఈరోజు సాయంత్రం ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈనేపథ్యంలో సాయంత్రం ఏం చెబుతారా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించాలనుకున్న ‘డాన్ 3’ సినిమా నుంచి రణ్వీర్ మధ్యలో వైదొలిగారు. ఈ క్రమంలో.. రణ్వీర్ చర్చలకు సహకరించలేదని, నిర్మాతలు నష్టపోయిన రూ.45 కోట్ల ప్రీ ప్రొడక్షన్ నష్టపరిహారం విషయంలో నిర్మాణ సంస్థతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునే వరకూ ఆయనతో కలిసి పని చేయవద్దని ఆదేశిస్తూ ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటుడి టీమ్ స్పందిస్తూ.. ఆయనకు వృత్తిపై అపారమైన గౌరవం ఉందని తెలిపింది. సినిమా హిట్ కావాలని కోరుకుంటారని అందుకే ఈ వివాదంపై మౌనంగా ఉంటున్నారని వెల్లడించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్లో చర్చనీయాంశమైన ‘డాన్ 3’ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. తనపై నిషేధం విధించిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సంస్థకు మంగళవారం...