
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో మానవత్వాన్ని మంటగలిపే ఒక అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అత్తింటి వారే కాలయముళ్లుగా మారి, ఒక వివాహితను ఏకంగా పది నెలల పాటు మరుగుదొడ్డిలోనే బంధించి నరకయాతన చూపించారు. బాధితురాలి తండ్రి బహుగుణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అమానుష ఉదంతం బయటపడింది.డెహ్రాడూన్ లో అత్తమామలతో ఉంటున్న కోడలు.. చిత్రహింసలు డెహ్రాడూన్ కు చెందిన రాహుల్‌ ఖండూరి అనే యువకుడికి సదరు యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2025 ఫిబ్రవరిలో కవల పిల్లలు జన్మించారు. భర్త రాహుల్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండటంతో, ఆమె డెహ్రాడూన్ లోని అత్తామామల వద్దే ఉంటోంది. అయితే, గత ఏడాది జులై నుంచి అత్తింటి వారు ఆమెను గదిలోనే బంధించి, బయటి ప్రపంచంతో మరియు పుట్టింటి వారితో మాట్లాడకుండా కట్టడి చేశారు.అన్నం కూడా పెట్టకుండా వేధింపులు బాధితురాలి తండ్రి ఎప్పుడు ఫోన్ చేసినా.. ఆమె నిద్రపోతోందని లేదా స్నానం చేస్తోందని అబద్ధాలు చెప్తూ తప్పించుకునేవారు. సందేహం వచ్చిన తండ్రి ఇటీవల బలవంతంగా వారి ఇంటికి వెళ్లి చూడటంతో అసలు నిజం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ పసిపిల్లల తల్లికి కనీసం అన్నం కూడా పెట్టకుండా.. కేవలం పచ్చి బియ్యం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మాత్రమే తినడానికి ఇచ్చేవారు.ఇనుపరాడ్లు, కర్రలు, సీసాలతో దాడులు అంతేకాకుండా రోజూ ఇనుప రాడ్లు, కర్రలు, సీసాలతో దారుణంగా కొట్టేవారు. చివరకు సెలవులకు ఇంటికి వచ్చే భర్త సైతం తల్లిదండ్రులతో కలిసి ఆమెను వేధించేవాడు. తీవ్రమైన హింస, కొట్టటం కారణంగా ఆమె జుట్టు మొత్తం ఊడిపోయి, ఆరోగ్యం అత్యంత క్షీణదశకు చేరుకుంది. ఈ విషయాలు ఎవరికైనా చెప్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారు.తెలంగాణా బరాబర్ మా అయ్య జాగీరే: పవన్ కళ్యాణ్ కు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్!తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు.. ఆస్పత్రికి బాధిత మహిళ ప్రస్తుతం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. తీవ్ర గాయాలతో ఉన్న సదరు మహిళను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్తతో పాటు అత్తామామలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఉదంతం తెలిసిన బాధిత మహిళ తరపు బంధువులు వారికి అలాంటి శిక్షే విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో మానవత్వాన్ని మంటగలిపే ఒక అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అత్తింటి వారే కాలయముళ్లుగా మారి, ఒక వివాహితను ఏకంగా...