ఫస్ట్ నైట్ జరిగిందన్నట్టుగా రాజు బిల్డప్ ఇస్తాడు. అదంతా శేషు, భ్రమరాంబ నమ్మేస్తారు. రేఖ కూడా కంగారు పడిపోతుంది. ఇంతలో ఇందు అక్కడకి వస్తుంది. ఇక ఇందుని ఆడుకునేందుకే.. ఏమో ఇందు అని పిలుస్తాడు రాజు. ఏయ్ రాజు ఏంటి.. ఓవర్ చేస్తున్నావ్ అని ఇందు అంటుంది. చూశావా మామయ్య.. భార్యని అలా పిలిస్తే తప్పా.. అని శేషుని ఉసిగొల్పుతాడు రాజు. ఏం తప్పు లేదు.. ఎందుకమ్మా అల్లుడిని అలా అంటావ్.. ప్రేమగా పిలిస్తే తప్పా అని శేషు అంటాడు. నాకు వేడి నీళ్లు పెట్టు.. రాత్రంతా నిద్రలేపు.. ఒంటినొప్పులు ఎక్కువగా ఉన్నాయ్ అని రాజు బిల్డప్ ఇస్తాడు. దీంతో శేషు, భ్రమరాంబ సిగ్గు పడిపోతుంటారు. అలా రేఖ ఈ ఇందుని పక్కకి తీసుకు పోతుంది. రాజు ఏమో ఇంకా తన యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంటాడు. మామ.. నాకు ఒళ్లంతా నొప్పులు ఎక్కువగా ఉన్నాయి.. ఆయిల్‌తో మసాజ్ చేస్తావా? అని రాజు అంటాడు. నేను నీ మామయ్యని.. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను అల్లుడు అని శేషు అంటాడు. ఇంకో వైపు ఫస్ట్ నైట్ గురంచి రేఖ అసలు విషయం రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది.ఏం జరగలేదు.. నైట్ ఏం జరగలేదు.. మీరు ఇచ్చిన మత్తుమందు పాలు తాగి పడుకున్నాడంతే అని ఇందు చెబుతుంది. మరి వాడేంటి అలా చెబుతున్నాడు అని రేఖ అడుగుతుంది. వాడు కిడ్నాపర్, లోఫర్ వాడు చెప్పింది మీరు నమ్ముతారా అని అమాయకంగా నటిస్తుంది ఇందు. ముందు వాడ్ని ఈ ఇంటి నుంచి పంపించేయండి.. సీఈవో అవ్వకుండా ఆపండి.. దాని గురించి ఆలోచించండి అని రేఖతో ఇందు అంటుంది. నా ప్లాన్స్ నాకు ఉన్నాయ్.. వాడు సీఈవో అవ్వడు.. నేనే అవుతాను అని రేఖ అంటుంది. మీరు కాదు.. నేను అవుతాను అని ఇందు లోలోపల అనుకుంటుంది.ఇందుని లాక్ చేసిన రాజు.. అందరి ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ ఏంటి? అని రాజుని ఇందు నిలదీస్తుంది. ఆ మాత్రం చేయకపోతే విషయం లేదని అనుకుంటారు.. ఇది నా కారెక్టర్‌కి సంబంధించిన అంశం అని రాజు అంటాడు. ఇలా చేస్తే కటింగ్స్ పడతాయ్ అని ఇందు బెదిరిస్తుంది. నేను ఒప్పుకోను.. నో కటింగ్స్.. ఎక్కువ చేస్తే అన్ని విషయాలు అందరికీ చెప్తా.. అప్పుడు మీ తాత, నానమ్మ ఏడుస్తారు.. రేఖ సంబరపడి ఆ మదన్ గాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అని రివర్స్‌లో రాజు బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో ఇందు సైలెంట్ అయిపోతుంది.వెంకీకి ధైర్యం చెప్పిన రాజు.. ఇంతలో రాజుకి ఫోన్ వస్తుంది. వెంకీ విషయం తెలిసి కంగారు పడతాడు. వెంటనే రాజు తన ఇంటికి వెళ్తాడు. నువ్వు చావాలని అనుకోవడం ఏంట్రా.. మేం నీకు గుర్తుకు రాలేదా.. నీకు ఏమైనా అయితే మేం ఎలా ఉంటాం రా అని రాజు అంటాడు. నువ్వు ఏమైనా తిట్టావా? అని చలపతిని రాజు అడుగుతాడు. అసలు మీకు మేం కన్న కొడుకులమేనా? అని రాజు అంటాడు. ఏంట్రా ఒక్కసారి అలా అనేశావ్.. మేమేరా నీ కన్నతల్లిదండ్రులం అని చలపతి అంటాడు. నా గురించి కాదు.. వాడి గురించి.. కన్న కొడుక్కి అలా అయితే నీకు కొంచెం కూడా బాధలేదా? అలా తింటున్నావ్ అని చలపతిని నిలదీస్తాడు రాజు.విమర్శించిన చలపతి.. సరే ఇవన్నీ పక్కన పెట్టు.. మరి ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్లావ్.. పెద్ద బిజినెస్ మెన్ వి అయ్యావు.. ఎంత సంపాదించావ్ అని రాజుని నిలదీస్తాడు చలపతి. సారు.. బిజినెస్ చేస్తాడు.. కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు.. అని చలపతి అవమానిస్తాడు. జాబ్ పోయింది.. వడ్డీలు, ఈఎంఐలు, అప్పులు ఎలా కట్టాలో తెలీడం లేదు.. అవన్నీ భరించలేక ఈ పని చేశాడు అని చలపతి అంటాడు. మనం మధ్య తరగతి వాళ్లం రా.. మనకు డబ్బు కంటే బంధాలే విలువ రా ఇలా ఎందుకు చేశావ్.. జాబ్ పోతే ఇంకొటి దొరుకుతుంది కదా అని రాజు కూడా మోటివేట్ చేస్తాడు.బాధపడిన తల్లిదండ్రులు.. నీలాంటి అమాయకులు, మంచివాళ్లు చిన్న సమస్య వస్తే ఇలానే చేస్తారు.. ఒకడు మనల్ని గేలి చేసినంత మాత్రానా మన జీవితం ఏమీ తలకిందులు అయిపోదు.. జనమంతా మనల్ని చూసి నవ్వినంత మాత్రానా మన జీవితం నాశనమైపోయినట్టు కాదు.. ఈ వెక్కిరింపులు, చీత్కారాలు ఏడమ చేత్తో తీసి పడేయాలి.. అని రాజు మోటివేట్ చేస్తాడు. వీడ్ని చూసి.. సిగ్గు లేకుండా బతకడం ఎలానో నేర్చుకో అని వెంకీని అడ్డం పెట్టుకుని రాజుని చలపతి తిడతాడు. నేను మీ గురించే కదా బిజినెస్ చేస్తున్నా.. అని రాజు అంటాడు. నువ్వేమో ఇంటి పట్టున ఉండటం లేదు అని లక్ష్మీ ఎమోషనల్ అవుతుంది.బిజినెస్ మాత్రమే చేస్తా.. నేను చెప్పిన ఫ్యాక్టరీలో సూపర్ వైజర్‌గా చేరు.. నెలకి పాతిక వేలు వస్తాయి. మా కళ్ల ముందే హాయిగా ఉండు రా.. మేం లేకపోయినా