
Samsung Galaxy A57 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ 5జీపై బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తగ్గింపు పొందవచ్చు. 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A57 5జీపై డీల్స్, ఆఫర్లు, ధరలపై వివరంగా పరిశీలిద్దాం.. శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ధర, ఆఫర్లు : శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ (Samsung Galaxy A57 5G) ప్రారంభ ధర రూ. 56,999తో పోలిస్తే ఇప్పుడు రూ. 51,950 తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఎస్బీఐ డెబిట్ కార్డ్ పేమెంట్లపై మరింత డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 38,950 ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్ ప్రస్తుత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ ధర కన్నా సుమారుగా రూ. 5వేలు తక్కువకే ఇంటికి తెచ్చుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ అందిస్తుంది. Read Also : Motorola Edge 2026 : మోటోరోలా మజాకా.. ట్రిపుల్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ వచ్చేసింది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్ భయ్యా..! కనెక్టివిటీ ఆప్షన్లలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ 2.0, జీపీయూఎస్, Wi-Fi, బ్లూటూత్ v6.0, NFC ఉన్నాయి. కొలతల ప్రకారం.. 161.5 మిమీ పొడవు, 76.8 మిమీ వెడల్పు, 6.9 మిమీ మందం, 179 గ్రాముల బరువు ఉంటుంది. సెన్సార్లలో యాక్సిలరోమీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గైరో సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A57 5జీలో ఎఫ్1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్2.2 అపర్చర్‌తో 5MP మాక్రో కెమెరా, ఎఫ్2.4 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ ఎక్సినోస్ 1680 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5పై రన్ అవుతుంది. Telugu » Technology » Amazon Offers Rs 5000 Discount On Samsung Galaxy A57 5g This June 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Samsung Galaxy A57 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ 5జీపై బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తగ్గింపు...