మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాపై అటు మెగా అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. జూన్ 3 నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ (PKCW) ఈ చిత్ర బృందానికి, రామ్ చరణ్‌కు అత్యంత ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఒక అదిరిపోయే వీడియో గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కొండగట్టు అంజన్న భక్తుడైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. చరణ్ నటిస్తున్న ఈ సినిమాకు ఆ హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చేసిన ట్వీట్లో ‘రామ్ చరణ్’ అనే పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. ‘‘రామ్ చరణ్ అనే పేరు కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. అది భగవంతుడైన శ్రీరాముడి పాదపద్మాలకు భక్తితో, శరణాగతితో ముడిపడి ఉన్న పవిత్ర నామం. భక్తి, శక్తి, సమర్పణకు నిలువెత్తు రూపమైన ఆ ఆంజనేయ స్వామితో కనెక్ట్ అయి ఉండే పేరు’’ అని పేర్కొన్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ‘పెద్ది’ చిత్ర నిర్మాణంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోయి, ఈ సినిమా ఘన విజయం సాధించాలని.. ప్రపంచవ్యాప్టంగా ఉన్న ప్రేక్షకుల ప్రేమను ఈ చిత్రం సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ‘జై భజరంగ భళి’ అంటూ.. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది.

ఇక షేర్ చేసిన వీడియో గ్లింప్స్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ కెరీర్‌లోని బెస్ట్ మాస్, యాక్షన్ సీన్స్‌తో పాటు, ఆయన చిన్నప్పటి రేర్ పిక్, అలాగే అంజన్న భక్తిభావం ఉట్టిపడేలా హనుమాన్ చాలీసా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వీడియోను అత్యంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాన్ నుంచి అబ్బాయి సినిమాకు ఇలాంటి సాలిడ్ సపోర్ట్, డివైన్ బ్లెస్సింగ్స్ రావడం మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్...